మృత్యువుతో పోరాటం.. సాయంకోసం ఎదురుచూపు
close
Published : 11/06/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మృత్యువుతో పోరాటం.. సాయంకోసం ఎదురుచూపు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆటో నడిపి బతుకు బండిని నెట్టుకొచ్చే అతడి జీవితాన్ని ఆనారోగ్యం అంధకారంలోకి నెట్టేసింది. ఐదేళ్లుగా మంచానికే పరిమితమై మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆరోగ్యం క్షీణించిందని, వైద్యం అందకపోతే అతడు బతికే అవకాశం లేదని వైద్యులు స్పష్టం చేశారు. మందులు, కుటుంబ పోషణకు అప్పుల పాలైన అతడు తన కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులకు విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం లేకపోయింది.

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం సత్తెమ్మ కాలనీకి చెందిన రాజశేఖర్‌ ఆటో నడుపుకొంటూ జీవనోపాధి పొందేవాడు. కొద్దికాలంగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. వాటి మార్పిడికి సుమారు రూ.కోటి ఖర్చవుతందని వైద్యులు పేర్కొనడంతో దిక్కుతోచని స్థితిలో సతమతవుతున్నాడు. రోజురోజుకీ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో భార్య, ఐదేళ్ల కూతురి భవిష్యత్‌పై తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. రాజశేఖర్‌ మిత్రులు కొంత ఆర్థిక సాయం అందించినా అది ఏమాత్రం సరిపోలేదు. పాదయాత్రలో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్‌ పెద్దాపురం వచ్చినప్పుడు రాజశేఖర్‌ ఆయనను కలిసి తన దయనీయ పరిస్థితిని వివరించగా ఆదుకుంటానని జగన్‌ పూర్తి భరోసా ఇచ్చారని, ఇప్పుడు తన కుటుంబానికి అండగా నిలవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. పింఛను కోసం కలెక్టర్‌ కార్యాలయంతోపాటు సీఎంవోకు కూడా నివేదించాడు. కుటుంబ పోషణ కష్టంగా ఉందని, తన దీనావస్థను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని రాజశేఖర్‌ వేడుకుంటున్నాడు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని