కశ్మీర్‌పై మీ జోక్యం వద్దే వద్దు: భారత్‌
close
Published : 23/01/2020 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కశ్మీర్‌పై మీ జోక్యం వద్దే వద్దు: భారత్‌

దిల్లీ: కశ్మీర్‌ అంశం ద్వైపాక్షిమైనదని, దీంట్లో ఎవరి జోక్యమూ అవసరం లేదని భారత్‌ మరోసారి తన వైఖరిని తేల్చి చెప్పింది. కోరుకుంటే కశ్మీర్‌ సమస్య పరిష్కారంలో సాయం చేస్తానంటూ దావోస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా భారత్‌ మరోసారి స్పందించింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ట్రంప్‌.. మంగళవారం పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలతో పాటు కశ్మీర్‌ అంశంపైనా చర్చ జరిగినట్టు ట్రంప్‌ చెప్పారు. అంతేకాకుండా కశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వం వహించి సమస్య పరిష్కారానికి సాయం చేస్తానన్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికారులు స్పందిస్తూ..  ‘‘కశ్మీర్‌ ద్వైపాక్షిక అంశం. దీన్ని ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటాం. ఈ విషయంలో భారత్‌ వైఖరి సుస్పష్టం. చర్చలు, ఉగ్రకార్యకలాపాలు ఒకేసారి కొనసాగవు. పాకిస్థాన్‌ ఉగ్రవాద కార్యకలాపాలు ఆపితేనే ఆ దేశంతో చర్చలు సాధ్యమవుతాయి’’ అని స్పష్టంచేశారు. 

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై పాకిస్థాన్‌ విషప్రచారం మొదలు పెట్టి.. భారత ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేందుకు విఫలయత్నం చేసి అభాసుపాలైంది. అంతేకాకుండా అమెరికా ద్వారా భారత్‌పై ఒత్తిడి తేవాలని చేసిన ప్రయత్నాలను మోదీ సర్కార్‌ దీటుగా తిప్పికొట్టింది. కశ్మీర్‌ అంశంలో జోక్యంచేసుకొని సమస్యను పరిష్కరించేందుకు సాయం చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించినా భారత్‌ మాత్రం అవసరం లేదని తేల్చిచెప్పేసింది. గతేడాది మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంలోనూ ట్రంప్‌తో భేటీ అనంతరం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో కశ్మీర్‌ వ్యవహారం ద్వైపాక్షికమైనదేనని.. ఇంకెవరి జోక్యమూ అవసరంలేదని మోదీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని