పాస్‌పోర్టు లేకుండా కర్తార్‌పూర్‌కు..
close
Updated : 08/02/2020 18:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాస్‌పోర్టు లేకుండా కర్తార్‌పూర్‌కు..

ఇస్లామాబాద్‌: కర్తార్‌పూర్‌ నడవాను పాస్‌పోర్టు లేని భారతీయులు సందర్శించుకునేందుకు వీలుగా ప్రతిపాదనను పాకిస్థాన్‌ ఆ దేశ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇజాజ్‌ షా తెలిపారు. ‘ప్రస్తుతం కర్తార్‌పూర్‌ నడవాను సందర్శించాలంటే భారతీయులు తప్పనిసరిగా పాస్‌పోర్టు  కలిగి ఉండాలి. ఇక నుంచి పాస్‌పోర్టు లేకపోయినా కర్తార్‌పూర్‌ను సందర్శించేందుకు అనుమతించాలి. ఇలా చేయడం వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది’ అని ఆయన తెలిపారు. ‘గురుద్వారాకు వచ్చిన వాళ్లు పాక్‌వైపు వెళ్లకుండా ప్రత్యేకంగా గేట్లు ఏర్పాటు చేస్తే అప్పుడు వాళ్లు అందులోనే ఉంటారు. అక్కడికి వచ్చిన వారి కదలికలను ఎప్పటికప్పుడు కెమెరాల ద్వారా నిశితంగా పరిశీలించొచ్చు’ అని ఆయన వెల్లడించారు. ఈ ప్రతిపాదనను పాక్‌ పరిశీలిస్తోంది.

భారత్‌, పాక్‌లోని పవిత్ర సిక్కు క్షేత్రాల్ని కలుపుతూ నిర్మించిన కర్తార్‌పూర్‌ నడవాను ఇటు ప్రధాని నరేంద్రమోదీ, అటు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ గతేడాది ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నడవాను మోదీ జాతికి అంకితం ఇచ్చారు. సిక్కుమత వ్యవస్థాపకుడు గురునానక్‌ దేవ్‌ సమాధి ఉన్న పాకిస్థాన్‌లోని పవిత్ర దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్‌ గురుద్వారాను అనుసంధానిస్తూ నడవాను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ నడవా మీదుగా రోజుకు 5వేల మంది యాత్రికులను అనుమతించనున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని