పాకిస్థాన్‌ స్టాక్‌ ఎక్స్చేంజీపై ఉగ్రదాడి
close
Updated : 29/06/2020 12:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాకిస్థాన్‌ స్టాక్‌ ఎక్స్చేంజీపై ఉగ్రదాడి

కరాచీ: కరాచీ నగరంలోని పాకిస్థాన్‌ స్టాక్‌ ఎక్స్చేంజీ(పీఎస్‌ఎక్స్‌) భవనంపై ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వీరిలో నలుగురు భద్రతాసిబ్బంది కాగా.. ఒక ఎస్సై ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని సిబ్బందిని ఖాళీ చేయించారు.

ఓ కారులో వచ్చిన నలుగురు ముష్కరులు పార్కింగ్‌ ఏరియా నుంచి లోపలికి ప్రవేశించినట్లు పీఎస్‌ఎక్స్‌ డైరెక్టర్‌ అబిద్‌ అలీ హబీబ్‌ తెలిపారు. తొలుత భవన ప్రధాన ద్వారం వద్ద గ్రనేడ్‌ విసిరినట్లు వెల్లడించారు. అనంతరం లోపలికి ప్రవేశించి విచక్షణారహింతంగా కాల్పులకు తెగబడ్డట్లు పేర్కొన్నారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనను సింధ్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ ఇమ్రాన్‌ ఇస్మాయిల్‌ తీవ్రంగా ఖండించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని