కట్టుదిట్టమైన జాగ్రత్తలతోనే కొవిడ్‌ కట్టడి
close
Published : 24/07/2021 05:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కట్టుదిట్టమైన జాగ్రత్తలతోనే కొవిడ్‌ కట్టడి

 9 రాష్ట్రాల్లో 10 వేల క్రియాశీలక కేసులు : కేంద్రం

దిల్లీ: దేశంలో 9 రాష్ట్రాల్లో ఇంకా కొవిడ్‌ 10 వేల చొప్పున క్రియాశీలక కేసులున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మహమ్మారి రెండో ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన కొవిడ్‌ జాగ్రత్తలను పాటించడం కీలకమని పునరుద్ఘాటించింది. ఈమేరకు యూనిసెఫ్‌ భాగస్వామ్యంతో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం అధికారులు, క్షేత్రస్థాయి విలేకరులకు పునశ్చరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ కొవిడ్‌తో పోరులో ఉదాసీనతకు చోటు లేదన్నారు. మీడియా ప్రతినిధులు సమాజంపై గొప్ప ప్రభావం చూపుతారని.. సానుకూల వార్తలతో ప్రజలను వ్యాక్సినేషన్‌ దిశగా ప్రోత్సహించాలని కోరారు. టీకాలపై ఉన్న సంకోచాన్ని పోగొట్టడంలో మీడియా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ సందర్భంగా దేశంలో కొవిడ్‌ పరిస్థితిని ఆయన వివరించారు. కొవిడ్‌ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం కూడా కీలకమైనదేనని.. ఈ అంశంపై సంబంధిత రాష్ట్ర, జాతీయ స్థాయి నిపుణులతో చెప్పించాలని మీడియా ప్రతినిధులను కోరారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని