Vaccine: ఫైజర్‌, మోడెర్నాలతో వీర్యకణాల సంఖ్య తగ్గదు
close
Updated : 19/06/2021 10:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccine: ఫైజర్‌, మోడెర్నాలతో వీర్యకణాల సంఖ్య తగ్గదు

వాషింగ్టన్‌: పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యానికి ఫైజర్‌, మోడెర్నా టీకాలు ఏమాత్రం హాని కలిగించవని తాజా అధ్యయనమొకటి తేల్చింది. వీర్యకణాల సంఖ్యను అవి తగ్గించవని నిర్ధారించింది. 18-50 ఏళ్ల మధ్య వయసున్న 45 మంది వాలంటీర్లపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మియామి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా.. తొలి డోసు వేయడానికి 2-7 రోజుల ముందు వాలంటీర్ల నుంచి వీర్యం సేకరించారు. రెండో డోసు పూర్తయ్యాక దాదాపు 70 రోజులకు మరోసారి వీర్యం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలకు అనుగుణంగా.. వీర్యం పరిమాణం, గాఢత, వీర్యకణాల చలనశీలత వంటి అంశాలను పరిశీలించారు. టీకా వేయించుకున్నాక ఏ ఒక్కరిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గలేదని గుర్తించారు. వాస్తవానికి రెండు డోసులు పూర్తయ్యాక వారిలో వీర్యకణాల సంఖ్య, చలనశీలత కొంతమేరకు మెరుగైందని పేర్కొన్నారు. ఫైజర్‌, మోడెర్నాల్లో సజీవ వైరస్‌ కాకుండా ఎంఆర్‌ఎన్‌ఏ ఉంటుందని పరిశోధకులు గుర్తుచేశారు. వీర్యంపై అవి ప్రభావం చూపే అవకాశాల్లేవని తేల్చిచెప్పారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని