మాగాణిలో కన్నీటి సుడులు
close
Updated : 30/07/2021 11:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాగాణిలో కన్నీటి సుడులు

ఈనాడు, నిజామాబాద్‌

నల్లవెల్లి శ్రీనివాస్‌ పొలంలో ఇసుక మేటలు, నిలిచిన నీరు

ర్షం రైతుల కష్టాన్ని ఇసుకపాలు చేసింది. లక్షలాది రూపాయల పెట్టుబడి నీళ్లలో పోసినట్లయింది. వాగులు పొంగటం.. చెరువులు అలుగు పోసిన చోట ఏమీ మిగలకుండా కొట్టుకుపోయింది. చాలా గ్రామాల్లో పొలాలు కోతకు గురికావటం.. ఇసుక మేటలు వేసిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. వరి పంటలో ఎకరాకు రూ.15 వేలు నష్టం వాటిల్లింది. ఇక పసుపులో రూ.50 వేల వరకు వరదపాలైంది. ఆయా భూములను తిరిగి సాగుకు యోగ్యమైనవిగా మార్చాలంటే పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సిందే. అప్పటి వరకు కాలం ఉండదనే ఆలోచనతో ఈ సీజన్‌లో ఇక పడావుగా వదిలేస్తున్నట్లు అన్నదాతలు వాపోతున్నారు. జిల్లాలో ఈ నెల 21-22 తేదీల్లో కురిసిన వర్షాలకు పంటలు వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. వ్యవసాయశాఖ ప్రాథమికంగా జరిపిన సర్వేలో పదివేల ఎకరాల వరకు నష్టపోయినట్లు తేలింది. ఉద్యానశాఖ జరిపిన సర్వేలో పసుపు పంట వెయ్యి ఎకరాల వరకు దెబ్బతిన్నట్లు గుర్తించారు. వరి 8 వేల ఎకరాలు, సోయ, మొక్కజొన్న వెయ్యేసి ఎకరాల్లో పోయింది. ఇంకా అనేక చోట్ల నీరు నిలిచి ఉండటం.. ఇసుక మేటలు ఉండటంతో ఆయా భూముల్లో ఈ సీజన్లో ఇక సాగు కష్టమని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.


రూ.రెండు లక్షలు పొయినట్లే


సాగుకు పనికి రాకుండా మారిన పొలాన్ని చూపిస్తున్న తెడ్డు రమేశ్‌

ర చెరువు కింద ఐదు ఎకరాల్లో వరినాట్లు వేశా. రూ. లక్ష వరకు ఖర్చయింది. చెరువు నిండి అలుగు పారడంతో వరద నీరంతా పొలాన్ని ముచ్చెత్తింది. మూడు ఎకరాల్లో వరిపైరు కొట్టుకుపోయింది. అడుగున్నర మందంతో ఇసుక మేటలు వేసింది. మరో రెండు ఎకరాల్లో పొలం కోతకు గురై గుంతలు పడ్డాయి. పైపులైను ధ్వంసమైంది. ఇసుక మేటలు తొలగించి, గుంతలు పూడ్చి, పైపులైన్‌ వేయాలంటే మరో రూ.1.50 లక్షలు ఖర్చు అయ్యేలా ఉంది. మరో వైపు సాగు సమయం మించిపోతోంది. చేసేదేమి లేక ఈ ఏడాది మాగాణి భూమిని పడావుగా వదిలేశా. ప్రభుత్వమే ఆదుకోవాలి.

- తెడ్డు రమేశ్‌, రైతు హాసాకొత్తూర్‌


గుంతలు పూడ్చితేనే సాగు..


ఇసుక మేట వేసిన పొలాన్ని చూపుతున్న సందుల నర్సయ్య

పొలానికి దగ్గరలోని కాలువ పొంగి రెండెకరాలు పూర్తిగా పోయింది. పెద్ద గోతులు.. ఇసుక మేటలు మిగిలాయి. నేను మళ్లీ సాగు చేయాలంటే భూమి చదును చేయడానికి, గుంతలు పూడ్చటానికి, దమ్ము చక్రాలు తింపడానికి పెట్టుబడి కావాలి. ఇప్పుటికిప్పుడు రూ.25 వేలు ఖర్చు చేస్తేగాని పొలం బాగు కాదు. నాలాగే చాలామంది నష్టపోయారు. ప్రభుత్వమే ఆదుకోవాలి.

- నర్సయ్య, రెంజర్ల, ముప్కాల్‌ మండలం


కష్టం ఇసుక పాలు..


ఆనవాలు కోల్పోయిన పొలం వద్ద రైతు

గారడి కుంట కింద రెండు ఎకరాల్లో వరినాట్లు వేశా. కుంట నిండి అలుగు పారింది. గైడ్‌వాల్‌ ధ్వంసమై వరద నీరంతా పొలం నుంచే పారింది. ఇసుక మేటలతో పైరు కొట్టుకుపోయింది. మళ్లీ సాగు చేద్దామంటే ఇసుకను పూర్తిగా తొలగించాలి. ఇప్పటికే రూ 40 వేలు ఖర్చు చేశాను. ఇంకా రూ.40 వేలు ఖర్చు చేస్తేగాని సాగు సాధ్యపడదు. ఇవన్నీ చేయాలంటే సమయం సరిపోదు. దీంతో మళ్లీ సాగుకు ప్రయత్నించడం లేదు.

- రాజమల్లు , కమ్మర్‌పల్లి


నాలుగెకరాలు కొట్టుకుపోయింది..

నాలుగు ఎకరాల్లో వేసిన వరి చెరువులు అలుగుపారటంతో కొట్టుపోయింది. రూ.60 వేల పెట్టుబడి నష్టపోయా. పక్కనే వరద కాల్వకు గండి పడింది. బోరు మోటారు పాడైంది. అలుగు నీరు పారేందుకు వరద కాలువపై నిర్మించిన దోని ఎత్తుగా ఉండడంతో వరదంతా నా పొలాల్లోంచి వెళ్లింది. వరదొచ్చినప్పుడల్లా ఇదే సమస్య ఉంటోంది.

- అనికేష్‌ రమేశ్‌, బోదేపల్లి, బాల్కొండ


పంట వేయలేని పరిస్థితి...

న్న 30 గుంటల్లో రూ.15 వేల ఖర్చుతో పొలం వేస్తే.. వర్షం దెబ్బతీసింది. కాల్వ గట్టు తెగిపోవడంతో వరద ప్రవాహానికి భూమిలో ఇసుక మేట వేసింది. మళ్లీ పంట సాగు చేయలేని పరిస్థితి . భూమి బాగు చేయాలంటే.. రూ.10 వేలు..పంట వేయాలంటే మరో రూ.15 వేలు కావాలి. ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే తప్ప ఈ సీజన్‌లో వేసే పరిస్థితి లేదు.

- చిత్తర్‌ వినీత్‌, పోతంగల్‌

 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని