చిన్నారికి మీరే మార్గదర్శి!
close
Published : 23/03/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నారికి మీరే మార్గదర్శి!

తమ కలల పంట... కంటి వెలుగైన పిల్లల్ని ఎవరైనా ఎంతో అపురూపంగా పెంచాలనుకుంటారు. అందుకోసం ఎన్నో జాగ్రత్తలూ తీసుకుంటారు. పెంపకానికి సంబంధించి మరెన్నో విషయాలూ తెలుసుకోవాలనుకుంటారు. మీరూ అలాగే అనుకుంటున్నారా...
అయితే వీటిని ఒకసారి గమనించండి.

తల్లిదండ్రులను పిల్లలెప్పుడూ అనుకరిస్తూనే ఉంటారు. మీరు మాట్లాడే విధానం, చేసే పనులు, భావోద్వేగాలు... ఇవన్నీ పిల్లల్ని ప్రభావితం చేస్తాయి. మీరు ప్రేమగా మాట్లాడుతూ కాస్త సహనంతో వ్యవహరిస్తే పిల్లలూ అవే పద్ధతుల్ని నేర్చుకుంటారు.
అడ్డుచెప్పకూడదు...
పిల్లలు చేసే ప్రతి పనికీ కొంతమంది తల్లిదండ్రులు అడ్డుచెబుతుంటారు. ‘ఇది చెయ్యొద్దు.. అది చెయ్యొద్దు...’ అని ఆంక్షలు విధిస్తుంటారు. దీంతో వాళ్లు సొంతంగా ఏ పని చేయడానికీ ఆసక్తి చూపించరు. ఏ పని చేయాలన్నా అమ్మానాన్న అనుమతి కోసం చూస్తుంటారు. ఇదే కొనసాగితే సొంతగా ఆలోచించే నైపుణ్యం చిన్నారులకు ఎప్పటికీ అలవడదు.
మీరూ మారాల్సిందే...
క్రమశిక్షణ పేరుతో చిన్నారులతో కాస్త కఠినంగా వ్యవహరించి ఉండొచ్చు. అయితే వారు కాస్త పెద్దయిన తర్వాత కూడా దాన్నే కొనసాగిస్తే మీకూ పిల్లలకూ మధ్య దూరం పెరుగుతుందేగానీ తగ్గదు. పరిస్థితులకు అనుగుణంగా మీరూ మారితేనే పిల్లలకు దగ్గర కాగలుగుతారు.
మీ ప్రవర్తనతో చెప్పాలి...
తల్లిదండ్రులుగా బిడ్డలు చేసిన తప్పులను వాళ్లకు తెలియజేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. అదే సమయంలో వాటిని ఎత్తిచూపడమే పనిగా పెట్టుకోకూడదు. చిన్నారులు తెలియక పొరపాట్లు చేసినా వారి పట్ల మీరు చూపించే ప్రేమాభిమానాల్లో ఎలాంటి మార్పూ ఉండకూడదు. ఇదే విషయాన్ని మాటల్లో కంటే మీ ప్రవర్తన ద్వారా తెలియజేస్తే బాగుంటుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని