వరుణ్‌ తేజ్‌ ‘గని’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ - ghani release date conformed
close
Updated : 28/01/2021 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుణ్‌ తేజ్‌ ‘గని’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

హైదరాబాద్‌: మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రబృందం తాజాగా విడుదల తేదీని ప్రకటించింది.

ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది జులై 30న ‘గని’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొంది. బాలీవుడ్‌ నటి సయీ మంజ్రేకర్‌ ఈ సినిమాలో సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి, ఉపేంద్ర ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. అల్లు బాబీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇదీ చదవండి

స్టార్‌హీరో పెళ్లిపై నటి వైరల్‌ కామెంట్‌Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని