వేపతో చర్మ సౌందర్యం..! - health and beauty benefits of neem in telugu
close
Published : 21/09/2021 19:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేపతో చర్మ సౌందర్యం..!

'అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే..' అంటూ తన ప్రేయసిని పొగుడుకుంటాడో హీరో.. కానీ ఆ మొటిమలు, మచ్చలు అమ్మాయిలకి ఎన్నో సమస్యలను తెచ్చిపెడతాయి. ఆ సమస్యలను తగ్గించేందుకు వేపను వాడండి. అందులోని యాంటీబయోటిక్ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుతాయి.

స్కిన్ టోనర్

గుప్పెడు వేపాకులను తీసుకొని రెండు లీటర్ల నీటిలో మరిగించండి. ఆ నీళ్లు ఆకుపచ్చగా మారే వరకు వేడి చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజూ స్నానం చేసే నీటిలో కొంచెం ఈ మిశ్రమాన్ని కలపడం వల్ల చర్మ సమస్యలు, మొటిమలు, వైట్‌హెడ్స్‌తో పాటు వయసు ప్రభావంతో వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి.. దీన్ని స్కిన్ టోనర్‌గానూ వాడచ్చు.. వేప నీటిలో ఓ కాటన్ బాల్‌ని ముంచి ప్రతి రోజూ రాత్రి ముఖాన్ని తుడుచుకోండి. దీని వల్ల పిగ్మెంటేషన్, మొటిమలు, మచ్చలు వంటివన్నీ తగ్గిపోతాయి.

వేప ప్యాక్..

ఓ పది వేపాకులు, దానికి కొన్ని నారింజ తొక్కలను కలిపి కొద్దిపాటి నీటిలో గుజ్జులా మారే వరకు మరిగించండి. దాన్లో కొద్దిగా తేనె, పెరుగు, సోయా పాలు వంటివి కలపండి. దీన్ని వారానికి మూడుసార్లు ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయండి.. ఫలితంగా మొటిమలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.

హెయిర్ కండిషనర్

కొన్ని వేపాకులను తగినన్ని నీళ్లలో వేసి మరిగించండి.. దీన్లో తేనెను కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేయండి. ఇది జుట్టుకు కండిషనర్‌గా పనిచేస్తుంది. బిరుసుగా ఉన్న జుట్టును పట్టులా మెత్తగా మారుస్తుంది. చుండ్రును కూడా తొలగిస్తుంది.

బెరడుతోనూ..

వేప బెరడు, వేర్లను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని తలకు పట్టించడం వల్ల పేల బాధ తొలగిపోతుంది. దీని వల్ల చుండ్రు కూడా తగ్గుతుంది.

వేప నూనె..

వేప నూనెను కొన్ని రకాల సబ్బులు, షాంపూలు, లోషన్స్, క్రీమ్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారు. దీనికి చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేసే గుణం ఉంటుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు మెరుస్తూ ఉంటుంది.

పొడి చర్మానికి

చర్మం పొడిబారిపోతోందా? వేప ప్యాక్‌ని ప్రయత్నించండి. వెంటనే ఫలితం కనిపిస్తుంది. వేప పొడిలో కొన్ని చుక్కల గ్రేప్ సీడ్ ఆయిల్‌ని కలపండి. దీన్ని మిశ్రమంలా చేసి ముఖానికి పట్టించండి. రెండు, మూడు నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయండి.

పొడవాటి జుట్టుకు..

వేపాకుల పొడిని తరచూ ఉపయోగిస్తూ ఉంటే కుదుళ్లలోని ఇన్ఫెక్షన్లన్నీ దూరమవుతాయి. వేప నూనెను తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గి పొడవుగా పెరుగుతుంది. దీంతో పాటు జుట్టు చిట్లిపోవడం కూడా తగ్గుతుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని