పొలార్డ్‌ 6 సిక్సర్లపై యువీ స్పందన ఇదే - how yuvraj singh reacted to kieron pollards six sixes in an over
close
Published : 04/03/2021 18:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పొలార్డ్‌ 6 సిక్సర్లపై యువీ స్పందన ఇదే

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెస్టిండీస్‌ పొడగరి కీరన్‌ పొలార్డ్‌ ఆరు సిక్సర్లపై టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్‌ స్పందించాడు. ఆరు సిక్సర్ల క్లబ్‌లోకి అతడికి స్వాగతం చెప్పాడు. ‘ఆరు సిక్సర్ల క్లబ్‌లోకి స్వాగతం కీరన్‌ పొలార్డ్‌. అద్భుతంగా ఆడావ్‌!!!’ అని ట్వీట్‌ చేశాడు.

ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన వీరులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. దక్షిణాఫ్రికా ఆటగాడు హర్షలె గిబ్స్‌ అందరికన్నా ముందుగా ఈ ఘనత సాధించాడు. 2007లో నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్‌ మ్యాచులో 6 సిక్సర్లు బాదేశాడు. ఆ తర్వాత అరంగేట్ర టీ20 ప్రపంచకప్‌లో యువీ ఈ ఘనతను అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచులో స్టువర్ట్‌ బ్రాడ్‌ విసిరిన ఓవర్లో ఆరుకు ఆరు సిక్సర్లు బాది తన పేరును మార్మోగించాడు. ఆ తర్వాత మరికొందరు ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు కానీ సాధ్యమవ్వలేదు. రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు రాహుల్‌ తెవాతియా గతేడాది ఐపీఎల్‌లో ఈ రికార్డు అందుకొనేలా కనిపించాడు. అయితే అతడు ఆరు బంతుల్లో ఐదు సిక్సర్లే బాదడం గమనార్హం.

మళ్లీ ఇన్నాళ్లకు పొలార్డ్‌ 6 బంతుల్లో 6 సిక్సర్లు సాధించాడు. శ్రీలంకతో జరిగిన టీ20 పోరులో అఖిల ధనంజయ వేసిన ఓవర్లో దంచికొట్టాడు. ఈ ఘనత సాధించిన వెంటనే వెస్టిండీస్‌ వ్యాఖ్యాత ఇయాన్‌ బిషప్‌ ‘యువరాజ్‌, హర్షలె గిబ్స్‌ ఆరు సిక్సర్ల క్లబ్‌లోకి మరొకరు ప్రవేశించారు’ అంటూ ఉత్సాహంగా చెప్పడం గమనార్హం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని