రణ్‌వీర్‌ను పెళ్లి చేసుకోడానికి కారణమదే: దీపిక - i married ranveer as he was comfortable when i was bigger star earned more money
close
Published : 01/02/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రణ్‌వీర్‌ను పెళ్లి చేసుకోడానికి కారణమదే: దీపిక

ఏడేళ్ల క్రితం పరిస్థితులు వేరు

ముంబయి: రణ్‌వీర్‌-దీపిక.. బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ జంట. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘రామ్‌లీలా’ చిత్రీకరణలో మొదటిసారి పరిచయమైన వీరిద్దరూ అదే సమయంలో ప్రేమలో పడ్డారు. ఏడేళ్ల డేటింగ్‌ తర్వాత ఈ జంట 2018లో నవంబర్‌ 14న వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కాగా, రణ్‌వీర్‌ కపూర్‌ను వివాహం చేసుకోడానికి గల కారణం గురించి ఇటీవల దీపికాపదుకొణె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఫేమ్‌, సంపాదనపరంగా రణ్‌వీర్‌ కంటే తాను ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ అతను మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండేవాడని.. ఒకేవిధంగా గౌరవించేవాడని.. అదే ఏడడుగుల బంధంలోకి వెళ్లేలా చేసిందని.. ఆమె తెలిపింది.

‘మొదటి నుంచి నా విజయాన్ని, సంపాదనను రణ్‌వీర్‌ ఎంతో గౌరవించాడు. ఇప్పుడు తాను కూడా స్టార్‌డమ్‌, ఫేమ్‌ పొందుతున్నాడు. కానీ ఏడేళ్ల క్రితం ఇవేమీ లేవు. అతను పరిచయమయ్యే సమయానికి నేను సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా ఉన్నాను. వరుస సినిమా షూట్స్‌తో చాలా బిజీగా గడిపేదాన్ని. కొన్నిసార్లు ఇంటికి కూడా వచ్చేదాన్ని కాదు. వరుస సినిమాల వల్ల నా సంపాదన కూడా ఎక్కువగానే ఉండేది. కానీ, మా ఇద్దరి మధ్య ఈ విషయాలేవీ వచ్చేవి కాదు. తను నన్ను అంతలా గౌరవించాడు. అలా మా బంధం మరింత బలపడింది. మేము ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టగలిగాం.’ అని దీపిక వివరించారు.

ఇదీ చదవండి

సెట్‌లో సేఫ్‌గా అనిపించలేదు: ప్రియాంక చోప్రా

పుష్ప షూట్‌.. బన్నీ ఎమోషనల్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని