అమెరికా టీకా కార్యక్రమంలో భారతీయ వైద్యులు - indian doctors in new jersey volunteering in vaccination
close
Published : 23/02/2021 13:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికా టీకా కార్యక్రమంలో భారతీయ వైద్యులు

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో కొవిడ్‌-19 టీకాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ప్రభుత్వాలకు సహకరించేందుకు భారతీయ-అమెరిన్‌ వైద్యులు ముందుకు వచ్చారు. వేలాది మంది పౌరులకు టీకాలు వేయడంలో వారంతా సహకరించనున్నారు. న్యూజెర్సీలోని ప్రజలకు టీకాలు వేసే కార్యక్రమంలో పాల్గొనే భారతీయ అమెరికన్‌ వైద్యులకు ముకేశ్‌ రాయ్, అవినాశ్‌ గుప్తాలు నేతృత్వం వహిస్తున్నారు.

ముకేశ్‌ రాయ్‌ ఓషన్‌ కౌంటీ ఆరోగ్య విభాగంలో ప్రజారోగ్య, ప్రణాళిక, విద్య విభాగానికి డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. హృద్రోగ నిపుణుడైన అవినాశ్‌.. భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం ఓషన్‌ కౌంటీ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కరోనా టీకాల కార్యక్రమాన్ని ప్రభుత్వం ఒక్కటే విజయవంతం చేయలేదని, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల సహకారం అవసరమని పేర్కొంటూ ఓషన్‌ కౌంటీ కమిషనర్‌ గెర్రీ లిటిల్‌ గతంలోనే ఓ ప్రకటన విడుదలచేశారు. ఈ ప్రకటనపై స్పందించిన రాయ్, గుప్తాలు.. వారాంతాల్లోని తీరిక సమయాన్ని ప్రజలకు కరోనా టీకాలు వేసేందుకు స్వచ్ఛందంగా వెచ్చించేలా భారత సంతతి వైద్యులను ఒప్పించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని