సంజనతో జ్ఞాపకాలు పంచుకొన్న బుమ్రా - jasprit bumrah recalls the best day of his life with wife sanjana ganesan
close
Published : 18/06/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంజనతో జ్ఞాపకాలు పంచుకొన్న బుమ్రా

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా తన సతీమణి సంజనతో కలిసి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకున్న రోజు తన  జీవితంలో మధురమైనదిగా వర్ణించాడు. ఆస్ట్రేలియాలో భారత్‌ 2-1తో సిరీస్‌ గెలవడం మర్చిపోలేదని వెల్లడించాడు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు సంజనా గణేశన్‌ తన భర్త జస్ప్రీత్‌ బుమ్రాను ఇంటర్వ్యూ చేసింది. ఆమె ఐసీసీ డిజిటల్‌ ఇన్‌సైడర్‌ వ్యాఖ్యాతగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుమ్రా ఇన్‌స్టాలోని పాత చిత్రాల గురించి ప్రశ్నించింది. అప్పటి సంఘటనల గురించి అడిగింది. ఈ వీడియోను ఐసీసీ ట్విటర్లో పంచుకుంది. ‘సోదరితో కలిసి ఆడటం.. స్కూల్‌ క్రికెట్లో మెరవడం.. తన జీవితంలోని అత్యుత్తమైన రోజు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు జస్ప్రీత్‌ బుమ్రా  ఇన్‌స్టా జ్ఞాపకాల గురించి సంజనా గణేశన్‌ అడిగింది’ అని వ్యాఖ్య పెట్టింది.

‘నా జీవితంలోనే అత్యుత్తమైన రోజది. అది (పెళ్లి) ఈ మధ్యే జరిగింది. ఆ జ్ఞాపకాల గురించి నీక్కూడా తెలుసు. అది నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజు. ఇవన్నీ చిరకాలం గుర్తుంటాయి. ఇంకా మరెన్నో రానున్నాయి’ అని తన పెళ్లి చిత్రం చూసిన బుమ్రా చెప్పాడు.

ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా 2-1తో సిరీస్‌ గెలిచిన విషయాలను బుమ్రా పంచుకున్నాడు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని పట్టుకున్న చిత్రం చూపించినప్పుడు ఆ విశేషాలు చెప్పాడు. ‘ఈ చిత్రం నాలుగో టెస్టు తర్వాత తీశారు. నేనా మ్యాచ్‌ ఆడలేదు. కుర్రాళ్లంతా ముందుకొచ్చారు. అదో మర్చిపోలేని విజయం. సంతోషకరమైన రోజులవి. మేం వరుసగా రెండోసారి అక్కడ సిరీస్‌ గెలిచాం. కాబట్టి అదీ మర్చిపోలేని రోజే’ అని అన్నాడు. అలాగే చిన్నప్పుడు సోదరితో క్రికెట్‌ ఆడటం, పాఠశాలలో క్రికెట్‌ ఆడటం గురించి వివరించాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని