నాని సినిమాలో? - kajal in talks for meet cute
close
Published : 18/06/2021 09:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాని సినిమాలో?

హైదరాబాద్‌: ఇటు నటుడిగా.. అటు నిర్మాతగా వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు కథానాయకుడు నాని. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో రెండు సినిమాలు ముస్తాబవుతున్నాయి. వీటిలో ఒకటి ‘హిట్‌ 2’ కాగా.. మరొకటి తాజాగా మొదలైన ‘మీట్‌ క్యూట్‌’. నాని సోదరి దీప్తి ఘంటా తెరకెక్కిస్తున్న తొలి చిత్రమిది. నటుడు సత్యరాజ్‌ ఓ శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఐదుగురు కథానాయికలు కీలక పాత్రల్లో నటించనున్నారు. వారెవరన్నది ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం చిత్రసీమ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఓ పాత్ర కోసం నటి కాజల్‌ను  సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు   పూర్తయ్యాయని, స్క్రిప్ట్‌ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ చేసేందుకు చందమామ అంగీకరించిందని వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమాలోని మిగతా పాత్రల కోసం నివేదా థామస్, రుహానీ శర్మ, అదా శర్మ తదితరుల పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాజల్‌ గతంలో నాని నిర్మాణంలో ‘అ!’ చిత్రం చేసిన సంగతి తెలిసిందే. అది ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చిరంజీవికి జోడీగా ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని