కార్గిల్‌ అమరవీరుడి కేసుపై హెచ్‌ఆర్‌సీ విచారణ - kargil jawan case taken by hrc
close
Published : 26/07/2020 17:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్గిల్‌ అమరవీరుడి కేసుపై హెచ్‌ఆర్‌సీ విచారణ

హైదరాబాద్‌: కార్గిల్‌ యుద్ధంలో వీరమరణం పొందిన విజయ్‌బాబు కేసును మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. సంగారెడ్డికి చెందిన విజయ్‌బాబు సైన్యంలో చేరి కార్గిల్‌ యుద్ధంలో మరణించాడు. అయితే రెండు దశాబ్దాలు గడిచినా విజయ్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. దీంతో విజయ్‌ బాబు కుటుంబసభ్యుల పరిస్థితి చూసి ఈ కేసులు మానవహక్కుల సంఘం సుమోటోగా తీసుకుంది. విచారణ జరిపి ఆగస్టు 27లోగా నివేదిక ఇవ్వాలని సంగారెడ్డి కలెక్టర్‌, సాధారణ పరిపాలన విభాగం ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ రోజే హెచ్‌ఆర్‌సీ కేసును స్వీకరించడం గమనార్హం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని