కీర్తిసురేశ్‌ అరుదైన ఘనత.. ‘ఫోర్బ్స్‌’లో చోటు - keerthy suresh in forbes indias 30 under 30 list
close
Published : 05/02/2021 02:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కీర్తిసురేశ్‌ అరుదైన ఘనత.. ‘ఫోర్బ్స్‌’లో చోటు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన అందం.. అభినయంతో నటి కీర్తి సురేశ్‌ అందరితో ‘మహానటి’ అనిపించుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తోంది. ఇప్పుడామె దక్షిణాదిలో అత్యంత ఆదరణ పొందిన హీరోయిన్‌. అయితే.. ఆమె తాజాగా ఒక అరుదైన ఘనత సాధించింది. ఏటా ప్రకటించే ‘ఫోర్బ్స్‌’ జాబితాలో చోటు దక్కించుకొంది. తాజాగా ఫోర్బ్స్‌ ఇండియా 2021 జాబితా ప్రకటించింది. వినోదరంగం విభాగంలో ‘30అండర్‌ 30’ జాబితాలో 28 ఏళ్ల కీర్తిసురేశ్‌కు 28వ స్థానం దక్కింది. బాలీవుడ్‌ నటి త్రిప్తి దిమ్రి 26వ స్థానంలో నిలిచింది. యూట్యూబర్ ఆశిష్ చంచలానికి కూడా ‘డిజిటల్ కంటెంట్ క్రియేటర్’ విభాగంలో ఫోర్బ్స్‌లో చోటు  కల్పించింది.

కేరళకు చెందిన కీర్తి సురేశ్‌ బాలనటిగా యాక్టింగ్‌లో కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత కొన్నాళ్లు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ వైపు వెళ్లింది. 2013లో మలయాళ చిత్రం ‘గీతాంజలి’లో ప్రధానపాత్ర పోషించింది. 2016లో ‘నేను శైలజ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ‘మహానటి’లో ఆమె నటనకు గానూ నేషనల్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు సొంతం చేసుకుంది. కీర్తి సురేశ్‌ ప్రస్తుతం ‘వాషి’ అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో ‘సర్కారు వారి పాట’లో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సరసన నటిస్తోంది. ‘రంగ్‌దే’ చిత్రంలో నితిన్‌తో కలిసి ఆడిపాడనుంది. దీంతోపాటు ‘గుడ్‌లక్‌ సఖి’, ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమాల్లో కూడా చేస్తోందీ మలయాళీ చిన్నది.

ఇదీ చదవండి..

మా ‘ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం’లో పెళ్లిళ్లు చేస్తాం!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని