ప్రేమ చాలా శక్తివంతమైనది: రియా - love is power says rhea chakraborty
close
Published : 30/03/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రేమ చాలా శక్తివంతమైనది: రియా

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తిపై సామాజిక మాధ్యమాల్లో నిత్యం ఏవో వార్తలు వస్తూనే ఉంటాయి. గతేడాది ఏడాది ఆమె ప్రియుడు, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌ మరణం తర్వాత రియా జీవితం పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ఆమెపై అనేక రకాల విమర్శలు, వివాదాలు చుట్టుముట్టాయి. తాజాగా సామాజిక మాధ్యమంలో ఓ పోస్టు చేసింది. ఆమె తన చేతిని తన స్నేహితురాలు, నిర్మాత అయిన నిధి హీరానందినితో చేతిని కలుపుతూ లవ్‌ సింబల్‌ ఆకారంలో పట్టుకొని ఉన్న ఓ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆ ఫొటోకి తనదైన శైలిలో స్పందిస్తూ...‘‘ప్రేమ అనేది చాలా శక్తివంతమైనది. దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ’’అంటూ పేర్కొంది. ప్రస్తుతం రియా చెహ్రే చిత్రంలో నటిస్తోంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, ఇమ్రాన్‌ హష్మీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరరకెక్కిన చిత్రానికి రూమీ జాఫరీ దర్శకత్వం వహించారు. సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ న్యాయవాది వీర్‌ పాత్రలో నటిస్తుండగా, ఇమ్రాన్‌ వ్యాపారవేత్త కరణ్‌ ఒబెరాయ్‌గా నటిస్తున్నారు.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని