సీఎం జగన్‌ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!

రాజంపేటలో గురువారం సీఎం జగన్‌ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్‌ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు.

Published : 10 May 2024 06:35 IST

రాజంపేట, న్యూస్‌టుడే: రాజంపేటలో గురువారం సీఎం జగన్‌ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్‌ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. సీఎం సభ ముగించుకుని వెళ్లిపోయాక, విద్యుత్తు సరఫరా పునరుద్ధరించే క్రమంలో రైల్వేకోడూరు మార్గంలోని ఎంజీఆర్‌ మాల్‌ వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై పనిచేస్తున్న విద్యుత్తు కార్మికుడు హరీష్‌ షాక్‌కు గురై కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆక్సిజన్‌ లేదని.. ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈలోపే మృత్యువాతపడ్డారు. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఆయన ప్రైవేటుగా విద్యుత్తు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పనుల కోసం అతన్ని ఆ శాఖ సిబ్బంది పిలిపించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని