భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు

ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Published : 10 May 2024 06:03 IST

 అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఈటీవీ భారత్‌: ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన జీవిత భాగస్వామితో విడాకులు తీసుకోకుండా వేరొక వ్యక్తితో కలిసి ఉండటాన్ని ముస్లిం వివాహ చట్టం అనుమతించదని అభిప్రాయపడింది. మహిళ కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన స్నేహ దేవి, మహద్‌ షాదాబ్‌ ఖాన్‌ కేసును విచారించిన జస్టిస్‌ ఎ.ఆర్‌.మసూది, ఎ.కే.శ్రీవాస్తవలతో కూడిన ధర్మాసనం ఈ విధంగా పేర్కొంది. 2020లో ఫరీదా ఖాతూన్‌ అనే మహిళను షాదాబ్‌ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం ఫరీదా తన తల్లిదండ్రులతో జీవిస్తుండగా.. అతడు మాత్రం స్నేహా దేవితో సహజీవనం చేస్తున్నాడు. స్నేహా దేవి కుటుంబసభ్యులు మాత్రం షాదాబ్‌ ఆమెను అపహరించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టుకు వెళ్లిన అతడు తాము ఇష్ట ప్రకారమే కలిసి జీవిస్తున్నామని, తనపై కిడ్నాప్‌ కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. బుధవారం విచారణ జరిపిన హైకోర్టు ఆర్టికల్‌ 21 ప్రకారం ఈ కేసులో ఎటువంటి రక్షణను కల్పించలేమని, స్నేహా దేవిని భద్రత మధ్య తన కుటుంబానికి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని