MAA Election: ‘మా’ ఎన్నికల బరిలో విష్ణు - manchu vishnu in maa president election
close
Updated : 22/06/2021 08:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Election: ‘మా’ ఎన్నికల బరిలో విష్ణు

చిత్రసీమలో ఎన్నికల వేడి మొదలైంది. త్వరలో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా కథానాయకుడు మంచు విష్ణు బరిలో దిగనున్నారు. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. తన తండ్రి మోహన్‌బాబుతో పాటు సీనియర్‌ నటులు కృష్ణ, కృష్ణంరాజు లాంటి వారిని సంప్రదించి.. ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనట్లు తెలియజేశారు. కొత్తతరం ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందనే ఉద్దేశంతో విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ‘మా’ సొంత భవనం ఏర్పాటే ప్రధాన ఎజెండాగా ఆయన ఈ ఎన్నికల్లో ముందుకు సాగనున్నారు. ఈసారి ‘మా’ అధ్యక్ష పోరులో తాను కూడా బరిలో నిలవనున్నట్లు నటుడు ప్రకాష్‌ రాజ్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని