రూ. 6.5 కోట్ల సెట్‌లో.. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ - massive set for shyam singha roy
close
Published : 18/04/2021 15:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ. 6.5 కోట్ల సెట్‌లో.. ‘శ్యామ్‌ సింగరాయ్‌’

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాని కథానాయకుడిగా దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ నాయికలు. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో కోల్‌కతాని తలపించే భారీ సెట్‌ని రూపొందించారు ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాశ్‌ కొల్లా. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5 కోట్లతో దీన్ని తీర్చిదిద్ది, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది. జిషు సేన్‌గుప్తా, రాహుల్‌ రవీంద్రన్‌, మురళీ శర్మ, అభినవ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కూర్పు: నవీన్‌ నూలి, కథ: సత్యదేవ్‌ జంగా. ఇప్పటికే విడుదలైన నాని ఫస్ట్‌లుక్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది. నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ చిత్రంగా నిలుస్తుంది ‘శ్యామ్‌ సింగరాయ్’.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని