జట్టుతో ఉండేవాడికి విశ్రాంతేంటి: వాన్‌  - michael vaughan criticizes england
close
Updated : 25/01/2021 22:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జట్టుతో ఉండేవాడికి విశ్రాంతేంటి: వాన్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియాతో తొలి రెండు టెస్టుల్లో జానీ బెయిర్ ‌స్టోకు విశ్రాంతినివ్వడం అర్థరహితమని ఆ జట్టు మాజీ సారథి మైకేల్‌ వాన్‌ అంటున్నాడు. జట్టుతోనే భారత్‌లో ఉండే అతడికి విశ్రాంతేంటని ప్రశ్నించాడు. అతడు స్పిన్‌ను ప్రశాంతంగా చక్కగా ఎదుర్కొంటాడని తెలిపాడు. ఈ మేరకు వాన్‌ ట్వీట్‌ చేశాడు.

భారత్‌తో ఇంగ్లాండ్‌ నాలుగు టెస్టుల్లో తలపడనుంది. తొలి రెండు టెస్టులు చెన్నైలో జరగనున్నాయి. ఈ మ్యాచుల్లో జానీ బెయిర్‌స్టోకు ఈసీబీ విశ్రాంతినిచ్చింది. మాజీ క్రికెటర్లకు ఈ నిర్ణయం రుచించడం లేదు. సెలక్టర్ల నిర్ణయం అర్థరహితమని బాహాటంగా విమర్శిస్తున్నారు. టీమ్‌ఇండియాపై అత్యుత్తమ జట్టును దించకపోవడం అవమానకరమని విమర్శిస్తున్నారు. మైకేల్‌ వాన్‌, కెవిన్‌ పీటర్సన్‌, నాసర్‌ హుస్సేన్‌ విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు.

‘టీమ్‌ఇండియాతో సిరీస్‌ ఆరంభమైనప్పుడు జానీ బెయిర్‌స్టో జట్టుతోనే ఉంటాడు. ఇంతకుముందే జట్టులో తిరిగి చోటు పొంది స్పిన్‌ను చక్కగా ఎదుర్కొనే ఆటగాడికి విశ్రాంతినివ్వడంలో అర్థమే లేదు’ అని మైకేల్‌ వాన్‌ సోమవారం ట్వీట్‌ చేశాడు. అంతకు ముందు ‘ఉపఖండం పరిస్థితుల్లో ప్రశాంతంగా, నియంత్రణతో ఆడగల ఇంగ్లాండ్‌ టాప్‌-3 ఆటగాళ్లలో అతనొకడు. సొంతగడ్డపై ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుపై తొలి రెండు టెస్టుల్లో విశ్రాంతినిస్తున్నారు!!! ప్రపంచానికి నిజంగానే పిచ్చెక్కింది...’ అని అతడు అన్నాడు.

ఇవీ చదవండి
కోహ్లీ అలా చేసేసరికి కన్నీళ్లు వచ్చాయి
శార్దూల్‌, సిరాజ్‌ రచించిన గబ్బా బౌలింగ్‌ వ్యూహం!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని