New Malware: మైక్రోసాఫ్ట్ యూజర్స్ జాగ్రత్త!  - microsoft warns its windows linux users about lemonduck malware
close
Updated : 30/07/2021 15:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

New Malware: మైక్రోసాఫ్ట్ యూజర్స్ జాగ్రత్త! 

ఇంటర్నెట్‌డెస్క్‌: జోకర్‌ మాల్‌వేర్.. గత కొంత కాలంగా టెక్ సంస్థలకు సవాల్‌ విసురుతున్న మాల్‌వేర్‌. దీనికి చెక్‌ పెట్టేందుకు టెక్ కంపెనీలు సరికొత్త అప్‌డేట్‌లను తీసుకొస్తున్నప్పటికీ హ్యాకర్స్‌ కొత్త పద్ధతుల్లో సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా విండోస్‌, లైనెక్స్ యూజర్స్‌కి లెమన్‌డక్‌ అనే కొత్త మాల్‌వేర్ ముప్పు పొంచి ఉన్నట్లు సైబర్‌ నిపుణులు వెల్లడించారు. ఈ వైరస్‌ గురించి ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తన యూజర్స్‌కి హెచ్చరికలు జారీ చేసింది. గత రెండు సంవత్సరాలుగా ఈ లెమన్‌డక్‌ మాల్‌వేర్ డివైజ్‌లపై దాడి చేస్తున్నట్లు సైబర్‌ నిపుణులు తెలిపారు. కొంత కాలంపాటు డివైజ్‌లలో స్తబ్దుగా ఉండి యూజర్స్ డివైజ్‌ల నుంచి డేటా సేకరించినట్లు గుర్తించామని పేర్కొన్నారు. అలానే ఈ మాల్‌వేర్ ఇతర కంప్యూటర్లలోకి ప్రవేశించి ఇతర మాల్‌వేర్‌లను నాశనం చేస్తుందని తెలిపారు. లెమన్‌డక్‌ డివైజ్‌లలోకి ఎలా వ్యాపిస్తుందో మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన కింది చిత్రంలో చూడొచ్చు. 

తాజాగా ఈ మాల్‌వేర్‌ సాయంతో సేకరించిన డేటాతో హ్యాకర్స్ క్రిప్టోకరెన్సీ రూపంలో బాధితుల నుంచి నగదు వసూలు చేస్తున్నారట. అందుకే యూజర్స్ క్రిప్టోకరెన్సీ లేదా ఇతర డిజిటల్‌ మనీకి సంబంధించి ఎలాంటి లింక్‌లను క్లిక్ చెయ్యొద్దని మైక్రోసాఫ్ట్‌ సూచించింది. లెమన్‌డెక్ మాల్‌వేర్ కంప్యూటర్లలోకి ప్రవేశించిన తర్వాత సెక్యూరిటీ కంట్రోల్స్‌ని తొలగించి యూజర్‌ ఆపరేషన్‌కి సంబంధించి కొన్ని టూల్స్‌ని ఇన్‌స్టాల్ చేస్తుంది. తర్వాత యూజర్‌ డివైజ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు హ్యాకర్‌ కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తుంది. అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, బ్రిటన్‌, భారత్, కొరియా, కెనడా, ఫ్రాన్స్, వియత్నాం దేశాల్లో ఈ మాల్‌వేర్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్‌లో పేర్కొంది. దీంతోపాటు లెమన్‌కాట్ అనే మరో కొత్త మాల్‌వేర్‌ సాయంతో మైక్రోసాఫ్ట్ ఎక్స్ఛేంజ్‌ సర్వర్‌ లక్ష్యంగా దాడులు చేసేందుకు ప్రయత్నిస్తోందని తెలిపింది. ఈ మాల్‌వేర్‌ బారినపడకుండా ఉండేందుకు మైక్రోసాఫ్ట్ డిఫెండర్‌ లేదా ఇతర యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడంతోపాటు, గుర్తుతెలియని, స్పష్టత లేని లింక్‌లను క్లిక్ చెయ్యొద్దని మైక్రోసాఫ్ట్ సూచించింది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని