చావ్లా.. ఏమివ్వగలడో తెలుసు: రోహిత్‌ - mumbai indians expect chawla to play key role this season
close
Published : 09/04/2021 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చావ్లా.. ఏమివ్వగలడో తెలుసు: రోహిత్‌

చెన్నై: వెటరన్‌ స్పిన్నర్‌ పియూష్‌ చావ్లాపై ముంబయి ఇండియన్స్‌ ప్రశంసలు కురిపించింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అతడికెంతో అపారమైన అనుభవం ఉందని తెలిపింది. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నప్పుడు కూడా అతడు కుర్రాళ్లకు చక్కగా మార్గనిర్దేశం చేయగలడని వెల్లడించింది. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో అతడిని ముంబయి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

‘అండర్‌-19 నుంచి పియూష్‌తో కలిసి ఆడాను. దూకుడైన బౌలర్‌. మా స్పిన్‌ విభాగంలో కోరుకుంటున్నదీ అదే. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన అతడిని తీసుకోవడం బాగుంది. ఐపీఎల్‌, ఫార్మాట్‌, ప్రత్యర్థులు, ఆటగాళ్ల గురించి అతడికి బాగా తెలుసు’ అని రోహిత్‌ అన్నాడు.

పియూష్ అనుభవానికి తామెంతో విలువ ఇస్తామని ముంబయి క్రికెట్‌ డైరెక్టర్‌ జహీర్‌ ఖాన్‌ అన్నాడు. యువకుడైన రాహుల్‌ చాహర్‌కు చావ్లా అనుభవం సాయపడుతుందని పేర్కొన్నాడు. అతడు నైపుణ్యంతోనే కాకుండా అనుభవం పరంగా కూడా జట్టుకు ఉపయోగపడతాడని వివరించాడు. ఒత్తిడి సందర్భాల్లో కీలక పాత్ర పోషిస్తాడని తెలిపాడు. జట్టులోని మిగతా స్పిన్నర్లందరికీ  మార్గనిర్దేశం చేయగలడని స్పష్టం చేశాడు.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు ఆడుతున్నందుకు సంతోషంగా ఉందని పియూష్‌ అన్నాడు. కుర్రాళ్లతో కలిసి ఆడేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నానని తెలిపాడు. ఐదుసార్లు విజేత జట్టులో భాగమవ్వడం తన అదృష్టమని వెల్లడించాడు.

‘రాహుల్‌ చాహర్‌ ఆటను చూశాను. జయంత్‌ యాదవ్‌, కృనాల్‌తో కలిసి ఆడాను. మా అనుభవాలను పరస్పరం పంచుకోవడం కీలకం. ఎందుకంటే కృనాల్‌కు తెలిసినవి నాకు తెలియకపోవచ్చు. నాకు తెలిసినవి రాహుల్‌కు తెలియకపోవచ్చు. ఒకర్నొకరం అర్థం చేసుకుంటూ ముందుకెళ్లడం ముఖ్యం’ అని చావ్లా అన్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని