‘ముంబయి సాగా’ టీజర్‌ అదిరింది!  - mumbai saga teaser out now
close
Updated : 24/02/2021 17:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ముంబయి సాగా’ టీజర్‌ అదిరింది! 

ముంబయి: బాలీవుడ్‌లో ముంబయి నేపథ్యంగా వచ్చే అండర్‌వరల్డ్ మాఫియా కథలకు డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా విడుదలైన ‘ముంబయి సాగా’ టీజర్‌ మళ్లీ ఆ వేడిని పుట్టిస్తోంది. జాన్‌అబ్రహం, ఇమ్రాన్‌ హష్మీ, సునీల్‌శెట్టి, కాజల్‌ అగర్వాల్‌, మహేష్‌ ముంజ్రేకర్‌ వంటి భారీ తారగణంతో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అమర్త్యరావ్‌గా జాన్‌ అబ్రహం పరిచయం రోమాంచితంగా ఉంది. పోలీస్‌ పాత్రలో నటిస్తున్న ఇమ్రాన్‌ హష్మీ ఎన్‌కౌంటర్లతో రౌడీలను మట్టుబెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. టీజర్‌ చూస్తుంటే ఇదొక కరుడుగట్టిన మాఫియా కథలా ఉంది. టి-సిరీస్‌ పతాకంపై సంజయ్‌గుప్తా దర్శకత్వంలో ఈ చిత్రం వస్తోంది. మార్చి 19 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. మరి లేటెందుకు ఆ టీజర్‌ను మీరు చూసేయండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని