Nayanthara: తప్పకుండా పెళ్లి చేసుకుంటాం: విఘ్నేశ్‌ - nayanthara boyfriend director vignesh sivan insta chat
close
Updated : 28/06/2021 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nayanthara: తప్పకుండా పెళ్లి చేసుకుంటాం: విఘ్నేశ్‌

నయన్‌తో సీక్రెట్‌ ఫొటో.. షేర్‌ చేసిన ప్రియుడు

చెన్నై: కోలీవుడ్ లవ్‌బర్డ్స్‌ నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ పెళ్లి గురించి అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తమ పెళ్లి గురించి దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ స్పందించారు. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నయన్‌తో దిగిన పర్సనల్‌ ఫొటోలను ఆన్‌లైన్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ విశేషాలివే..

మీరు సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి ఎవరు?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయనే నా అభిమాన హీరో. నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఇప్పుడు దర్శకుడిగా మీ ముందు ఉన్నానంటే దానికి ప్రేరణనిచ్చింది కూడా ఆయనే. భవిష్యత్తులో ఛాన్స్‌ వస్తే తప్పకుండా ఆయనతో ఓ సినిమా చేయాలని ఉంది. అది కూడా ఫుల్ జోష్‌తో ఉండే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. 

మీరు ప్రేమకథలే ఎక్కువ రాస్తుంటారు కదా? ఇవి కాకుండా మరేదైనా జోనర్‌లో సినిమాలు చేయాలంటే ఏది ఎంచుకుంటారు?

సైన్స్‌ ఫిక్షన్‌, సోషియో ఫాంటసీ, ఎమోషనల్‌ డ్రామా.. భవిష్యత్తులో ఈ జోనర్లలో సినిమాలు చేయాలని ఉంది.

ఒకవేళ మీరు హార్రర్‌ సినిమా తెరకెక్కించాలనుకుంటే అందులో ఎవర్ని నటీనటులుగా తీసుకుంటారు?

నేను రాసుకున్న కథకు సరిపడే విధంగా ఉన్న నటీనటుల్ని

‘పావ కథైగళ్‌’ సిరీస్‌లో మీరు దర్శకత్వం వహించిన ‘లవ్‌ పన్న విట్రనమ్‌’ కాకుండా మీకు బాగా నచ్చిన ఎపిసోడ్‌ ఏది?

ఆ సిరీస్‌లో నేను దర్శకత్వం వహించిన ఎపిసోడ్స్‌ కంటే కూడా మిగిలిన ముగ్గురు దర్శకులు తెరకెక్కించిన మూడు కథలు నాకెంతో బాగా నచ్చాయి.

ఒకవేళ మీకు బాలీవుడ్‌లో సినిమా తెరకెక్కించే ఛాన్స్ వస్తే.. ఎవర్ని హీరోగా తీసుకుంటారు?

బీటౌన్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌తో సినిమా చేస్తా. ఆయన్ని డైరెక్ట్‌ చేసే అవకాశం వస్తే సంతోషంగా ఫీల్‌ అవుతా.

ఒకవేళ మీకు సమయాన్ని వెనక్కి తీసుకువెళ్లే అవకాశం ఉంటే.. ఏ మూమెంట్‌ని మళ్లీ ఆస్వాదించాలనుకుంటున్నారు?

నాకు భవిష్యత్తు గురించే కలలు, ఆశలు. కాబట్టి అవకాశం వస్తే నేను భవిష్యత్తుకు ట్రావెల్‌ చేస్తా.

నయన్‌తో కలిసి పర్యటించిన ఏ ప్రాంతమంటే మీకు ఎక్కువ ఇష్టం?

నయనతో ఉండే ప్రతి ప్రదేశం నాకు బాగా నచ్చుతుంది.

నయనతార నటించిన ‘నేత్రికన్‌’ ఎప్పుడు విడుదల కానుంది?

అతి త్వరలో మీ ముందుకు వస్తుంది.

మీకిష్టమైన గీత రచయితలు ఎవరు?

వైరముత్తు, వాలి, ముత్తుకుమార్‌, ధనుష్‌, శింబు.. వీళ్లే నాకు స్ఫూర్తి. అలాగే వాళ్లు రాసిన పాటలు ఎంతో బాగుంటాయి.

సింగపూర్‌లో మీకు బాగా నచ్చిన ప్రాంతమేది?

CLARKE QUAY

డెస్టినేషన్‌ కోసం మీరు ఎక్కువగా వెళ్లాలనుకునే ప్రదేశం?

IBIZA

సంగీత దర్శకుడు అనిరుధ్‌తో మీకున్న అనుబంధం ఏమిటి?

అనిరుధ్‌ నాకొక మంచి స్నేహితుడు. నయనతార కథానాయికగా నేను దర్శకత్వం వహించిన ‘నాను రౌడీ దానే’ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సమయంలో మా ఫ్రెండ్‌షిప్‌ మరింత బలపడింది. ఆ రోజులు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

వెస్ట్రన్‌, ట్రెడిషనల్‌.. ఎలాంటి లుక్‌లో నయనతార మీకు బాగా నచ్చుతుంది?

నయన్‌కు చీర బాగా సెట్‌ అవుతుంది. చీరలో ఆమె ఎంతో అందంగా ఉంటుంది. అందుకే చీరకట్టులో నయన్‌ అంటే నాకెంతో ఇష్టం.

నయన్‌తో మీరు తీసుకున్న సీక్రెట్‌ ఫొటో షేర్‌ చేయగలరు?

మీకిష్టమైన క్రికెటర్‌ ఎవరు?

అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఎం.ఎస్‌.ధోనీ

రజనీకాంత్‌ నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన చిత్రమేది?

బాషా

సూర్య సినిమాల్లో మీకు నచ్చినది?

‘కాక్క కాక్క’ (ఘర్షణ తమిళ వెర్షన్‌), ‘గజిని’, ‘సింగం’, ‘ఆకాశమే నీ హద్దురా’

అసలు నెగెటివిటీని ఎలా ఎదుర్కొవాలి?

దాని గురించి అస్సలు పట్టించుకోకండి.

మీరు థియేటర్‌లో చూసిన సరికొత్త సినిమా ఏది?

ఏఆర్‌ రెహమాన్‌ రూపొందించిన 99 సాంగ్స్‌

మీ జీవితంలో ఇప్పటివరకూ చూసిన వ్యక్తుల్లో ది బెస్ట్‌ పర్సన్‌ ఎవరు?

నయన్‌ వాళ్లమ్మగారు. మిసెస్‌ కురియన్‌

మీరూ నయన్‌ పెళ్లి చేసుకుంటారని మేము ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నాం? ఎందుకని మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవడం లేదు?

పెళ్లి చేసుకోవడమంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ప్రస్తుతం నేను పెళ్లి కోసం డబ్బు దాచిపెడుతున్నాను. కరోనా వైరస్‌ తొలగిపోయి పరిస్థితులు చక్కబడిన తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటాం.

నయనతారకు మీరు ఇచ్చిన మొట్టమొదటి బహుమతి ఏమిటి?

‘నాను రౌడీ దానే’లో తంగమై పాట

మీకిష్టమైన మలయాళీ, తెలుగు నటులెవరు?

మోహన్‌లాల్‌, ఫహద్‌ ఫాజిల్‌, అల్లు అర్జున్‌, మహేశ్‌బాబు

నయన్‌కి, మీకూ మధ్య ఉన్న రహస్యాలు ఏమైనా చెప్పగలరు?

ప్రతిరోజూ రాత్రి భోజనం తర్వాత మేము తిన్న గిన్నెలన్నింటినీ నయనే శుభ్రం చేస్తుంది. అలాగే నయన్‌ చేసే వంటకాల్లో ఘీ రైస్‌ చికెన్‌ కర్రీ అంటే నాకెంతో ఇష్టం.

సమంత గురించి ఏమైనా చెప్పగలరు?

సామ్‌.. అద్భుతమైన నటి. రూపంలోనే కాదు మనసు పరంగానూ తను అందమైన వ్యక్తి.

ఎక్కడికైనా దూరంగా వెళ్లాలనుకుంటే ఏ ప్రాంతానికి వెళ్తారు?

నయన్‌తో ఎక్కడికి వెళ్లడానికైనా నాకు ఇష్టమే!

నయన్‌తార నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన చిత్రమేది?

రాజు రాణీ

అంతరిక్ష ప్రయాణానికి వెళ్లాలనుకుంటే ఎవరితో వెళతారు?

లతా మంగేష్కర్‌, చిత్ర

మీరు చాట్‌ చేస్తున్న ప్రతిసారీ మిమ్మల్ని నయన్‌ గురించే అడుగుతున్నారు కదా? దానికి మీరు ఎలా ఫీల్‌ అవుతున్నారు?

గర్వంగా ఫీల్‌ అవుతున్నాను.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని