మహిళల కోసం నీతా అంబానీ సోషల్‌మీడియా - nita ambani launches social media platform her circle for women
close
Updated : 08/03/2021 04:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహిళల కోసం నీతా అంబానీ సోషల్‌మీడియా

ముంబయి: మహిళా సాధికారతే లక్ష్యంగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా ముకేశ్‌ అంబానీ కొత్త సామాజిక మాధ్యమ వేదికను ప్రారంభించారు. ‘హెర్‌ సర్కిల్‌’గా దానికి నామకరణం చేశారు. కేవలం మహిళలకు సంబంధిత విషయాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఫ్యాషన్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, బ్యూటీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన ఆర్టికల్స్‌ను చదవడంతో పాటు సంబంధిత వీడియోలనూ ఈ వేదిక ద్వారా వీక్షించొచ్చు. అవసరమైతే హెల్త్‌, వెల్‌నెస్‌, ఎడ్యుకేషన్‌కు, ఫైనాన్స్‌, లీడర్‌షిప్‌, మెంటార్‌ షిప్‌ వంటి విషయాల్లో రిలయన్స్‌ ప్యానెల్‌ నిపుణులు సమాధానాలు కూడా ఇస్తారు.

తన జీవితంలో ఎన్నో నేర్చుకున్నానని, వాటన్నింటినీ ఇతరులకు పంచుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించినట్లు నీతా అంబానీ పేర్కొన్నారు. అలాగే మహిళలంతా ‘హెర్‌ సర్కిల్‌.ఇన్‌’లో చేరి ఇతరులతో తమ ఆలోచనలను పంచుకోవాలని సూచించారు. మహిళల కోసం ఒక సామాజిక మాధ్యమ వేదికను తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి మహిళా ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. హెర్‌ సర్కిల్‌.ఇన్‌ రిజిస్ట్రేషన్‌ ఉచితంగానే అందిస్తున్నారు. ప్రస్తుతం ఆంగ్లంలో అందుబాటులో ఉండగా.. క్రమంగా ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని