adipurush: నేను ఏ స్టెరాయిడ్స్‌ వాడటం లేదు - no steroids only natural bulking prabhas sunny singh for adipurush movie
close
Published : 21/05/2021 23:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

adipurush: నేను ఏ స్టెరాయిడ్స్‌ వాడటం లేదు

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రభాస్‌ ప్రధాన పాత్రలో ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’. ఇందులో రాముడిగా ప్రభాస్‌ నటిస్తుండగా రావణుడిగా పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. లక్ష్మణ్‌ పాత్రలో సన్నీ సింగ్‌ నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్ర కోసం శరీరాకృతిని మార్చుకునేందుకు సిద్ధమైయ్యారు సన్నీ. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ..‘‘ఈ సినిమాలో సహజ సిద్ధంగా కనిపించేందుకు చాలా కష్టపడుతూ వర్కౌట్స్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ లాక్‌డౌన్ సమయంలో పాత్ర కోసం కచ్చితమైన డైటింగ్‌ మెనూని అనుసరిస్తున్నా. ‘ఆదిపురుష్‌’ కోసం ఎలాంటి ఉత్తేజిత మందులను వాడడం లేదు. అంతా సహజ సిద్ధంగానే శరీరాకృతిని మార్చుకుంటున్నాం. రోజులో 10-15 గుడ్లు తీసుకుంటాను. నాలుగు నుంచి ఐదుసార్లు ఆహారాన్ని తీసుకుంటున్నా’’ వెల్లడించారు.

సన్నీ తొలిసారిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’. టీ-సీరీస్‌ ఫిల్మ్స్, రెట్రోఫిల్స్ సంస్థలు కలిసి నిర్మిసున్న ఈ సినిమాలో కృతి సనన్ సీతగా నటిస్తోంది. చిత్రానికి కార్తిక్‌ పళని సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. సినిమా తెలుగు, హిందీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఆగస్టు 11న చిత్రం తమిళ, కన్నడ, మలయాళంలోనూ విడుదల కానుంది.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని