రిటర్న్ గిఫ్ట్ ఏం అడిగాడో తెలుసా
హైదరాబాద్: సినిమా పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కు ఎంతోమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి అభిమానుల్లో ఒకరు తారక్ కారుకు సంబంధించిన ట్రాఫిక్ జరిమానా చెల్లించాడు. అంతేకాకుండా దానికి ప్రతిఫలంగా హీరో ముందు ఓ చిన్న వినతిని ఉంచాడు.
నెహ్రూ ఔటర్ రింగురోడ్డుపై ఓవర్‌స్పీడ్‌లో కారు నడిపినందుకు గాను ట్రాఫిక్ పోలీసులు ఎన్టీఆర్‌కు రూ.1035 జరిమానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న ఓ అభిమాని ఆన్లైన్లో జరిమానా మొత్తాన్ని చెల్లించాడు. దీనిని తెలియజేస్తూ.. ఆన్లైన్ బ్యాంకింగ్ ఫొటోని ట్విటర్లో షేర్ చేశాడు. ‘‘తారక్ అన్నా.. నాతోపాటు నా స్నేహితులు కొంతమందికి మల్లికార్జున లేదా భ్రమరాంబ థియేటర్లలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్లు ఇప్పించండి’’ అంటూ ఆ అభిమాని ఎన్టీఆర్ ముందు ఓ చిన్న విన్నపాన్ని ఉంచాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.
రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్-ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్నారు. బాలీవుడ్ నటి ఆలియాభట్ సీతగా చెర్రీ సరసన సందడి చేయనున్నారు. అలాగే హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ ఎన్టీఆర్‌కు జోడీగా కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభమైంది. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇవీ చదవండి
బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాలో చెర్రీ-యశ్..?
మరిన్ని
కొత్త సినిమాలు
-
రెండోసారి.. పంథా మారి
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
‘సైనా’ రాకెట్‌తో పరిణీతి!
గుసగుసలు
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ప్రతి మనిషిలోనూ రైతు ఉన్నాడు: బుర్రా
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
-
నమ్మించి మోసం చేశారు: జయలలిత
-
అందుకే హాకీని ఎంపిక చేసుకున్నాం!
కొత్త పాట గురూ
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’