POOJA: నన్ను వెంబడించి ఇంటికి వచ్చేశారు - pooja chopra on a scary fan encounter
close
Published : 16/05/2021 12:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

POOJA: నన్ను వెంబడించి ఇంటికి వచ్చేశారు

వాళ్లని చూసి భయపడ్డా

ముంబయి: ఇటీవల గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు తన కారుని వెంబడించి.. ఇంటికి వచ్చేశారని నటి పూజాచోప్రా తెలిపారు. వాళ్లని చూసి తాను ఎంతో భయపడినట్లు ఆమె చెప్పారు. 2013లో విడుదలైన ‘కమాండో’తో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు పూజాచోప్రా. సహాయ నటిగా కెరీర్‌ను ఆరంభించి ప్రస్తుతం కథానాయికగా విభిన్నమైన కథలతో మెప్పిస్తున్నారు. ఈ ముద్దుగుమ్మకు సోషల్‌మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.

కాగా, రెండు నెలల క్రితం ఇద్దరు వ్యక్తులు తనని వెంబడించారని తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘దాదాపు రెండు నెలల క్రితం నేను ఓ కొత్త అపార్ట్‌మెంట్‌లో ఇల్లు తీసుకున్నాను. ఆ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ కళ్లుగప్పి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మా అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి.. నా ఇంటి తలుపుతట్టారు. నేను తలుపు తెరవగానే.. ‘ఆటోగ్రాఫ్‌ కావాలి. సెల్ఫీ కావాలి’ అని అడిగారు. ఒక్కక్షణం షాక్‌ అయ్యాను. వాళ్లని చూసి భయపడ్డాను. అప్పుడు నాతో ఉన్న ఇద్దరు స్నేహితులు ‘ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు?’ అని అడిగారు. వాళ్లని అక్కడి నుంచి పంపించివేశారు. అనంతరం నేను సెక్యూరిటీకి ఫోన్‌ చేసి.. బయటవాళ్లు అపార్ట్‌మెంట్‌లోకి ఎలా వచ్చారు? అని ఆరా తీశాను. సీసీ ఫుటేజీ పరిశీలించి.. వాళ్లిద్దరూ బైక్‌పై నా కారుని ఫాలో అవుతూ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారని చెప్పారు. ఆ ఘటన నాలో భయాన్ని రేకెత్తించింది’ అని పూజాచోప్రా వివరించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని