రష్మిక.. తొలి అడుగు వేసింది - rashmika on sets of mission majnu
close
Published : 05/03/2021 22:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రష్మిక.. తొలి అడుగు వేసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాదిలో వరుస విజయాలు అందుకుంటూ అగ్ర కథానాయికల జాబితాలో చేరింది రష్మిక మందన. అదే జోరులో ఈ భామ బాలీవుడ్‌ అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. సిద్దార్థ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతోన్న ‘మిషన్‌ మజ్ను’ చిత్రంతో హిందీ ప్రేక్షకులకు నేరుగా పరిచయం కాబోతుంది. శుక్రవారం ఈ సినిమాలో సెట్స్‌లో అడుగుపెట్టింది రష్మిక. సెట్‌లో క్లాప్‌ కొడుతూ సందడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది.  ప్రస్తుతం లఖ్‌నవూలో చిత్రీకరణ జరుపుకొంటోందీ సినిమా. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోంది. శంతన్‌ బాగ్చి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఆర్‌ఎస్‌వీపీ మూవీస్‌, గిల్టీ బై అసోసియేషన్‌ మీడియా, ఎల్‌ఎల్‌పీలు సంస్థలు నిర్మిస్తున్నాయి. తెలుగులో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’లో రష్మినే నాయిక. సుకుమార్‌ దర్శకుడు. ఆగస్టు 13న విడుదలకానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని