వాద్రాకు కరోనా.. స్వీయ నిర్బంధంలోకి ప్రియాంక! - robert vadra tests positive for covid priyanka gandhi self-isolates
close
Published : 02/04/2021 15:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాద్రాకు కరోనా.. స్వీయ నిర్బంధంలోకి ప్రియాంక!

దిల్లీ: కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తన భర్త రాబర్ట్‌ వాద్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో నేటి అసోం ఎన్నికల పర్యటనను ఆమె రద్దు చేసుకున్నారు. నిన్న కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా తనకు నెగెటివ్‌ వచ్చిందని ప్రియాంక వెల్లడించారు. కానీ, వైద్యుల సలహా మేరకు కొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌లో వెళ్తున్నానంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్న ప్రియాంక గాంధీ ఈ రోజు అసోం, రేపు తమిళనాడు, ఆదివారం రోజున కేరళలో పర్యటించాల్సి ఉంది. అయితే, కొవిడ్‌ కలకలం నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి రాలేకపోతున్నందున ప్రతిఒక్కరినీ క్షమాపణ కోరుతున్నానన్నారు. కాంగ్రెస్‌ గెలుపు కోసం ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని