‘సత్యమేవ జయతే’ వచ్చేసింది - satyamevajaythe song from vakeel sab
close
Published : 03/03/2021 17:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సత్యమేవ జయతే’ వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. ఈ చిత్రంలోని రెండో గీతం ‘సత్యమేవ జయతే’ లిరికల్ వీడియోను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. గాయకుడు శంకర్‌ మహదేవన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రచించగా తమన్‌ స్వరాలు సమకూర్చారు. శంకర్‌ మహదేవన్‌, పృథ్వీ చంద్ర, తమన్‌ ఆలపించారు.

హిందీలో విజయవంతమైన ‘పింక్‌’ రీమేక్‌గా రూపొందుతుందీ చిత్రం. శ్రుతి హాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పిస్తున్నారు. ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. పవన్‌ రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని