సంక్రాంతి సందళ్లకు ‘శ్రీకారం’ - sharwanand sreekaram sandalle sandalle lyric
close
Published : 08/01/2021 20:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్రాంతి సందళ్లకు ‘శ్రీకారం’

‘‘సందళ్లె.. సందళ్లే.. సంక్రాంతి సందళ్లే. అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్లే’’ అంటూ ఊరివాళ్లతో కలిసి చిందేస్తూ సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుట్టారు శర్వానంద్‌. ఆయన హీరోగా బి.కిశోర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీకారం’. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. మిక్కీ జే.మేయర్‌ స్వరాలందించారు. సంక్రాంతి కానుకగా గురువారం ఈ చిత్రం నుంచి రెండో గీతాన్ని విడుదల చేశారు. ‘‘సంక్రాంతి సందళ్లే’’ అంటూ పండగ విశిష్ఠతను తెలియజేసేలా సాగుతున్న ఈ గీతానికి సానపాటి భరద్వాజ్‌ పాత్రుడు చక్కటి సాహిత్యమందించగా..అనురాగ్‌ కులకర్ణి, మోహనన్‌ భోగరాజు ఆకట్టుకునేలా ఆలపించారు. ‘‘రైతు కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని చిత్ర బృందం తెలియజేసింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని