చాహల్ భార్యతో అయ్యర్‌ అదిరే స్టెప్పులు - shreyas iyer and yuzvendra chahals wife dhanashree vermas shuffle dance leave netizens impressed
close
Published : 10/02/2021 17:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చాహల్ భార్యతో అయ్యర్‌ అదిరే స్టెప్పులు

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మతో కలిసి యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అదిరే స్టెప్పులు వేశాడు. ‘రోసెస్’ సాంగ్‌కు ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా స్టెప్పులు ఇరగదీశాడు. దీనికి సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దానికి ‘మా పాదాల వైపు చూస్తున్నారా?’ అని వ్యాఖ్య జత చేశాడు.

ఈ వీడియోకి కొన్ని గంటల్లోనే అయిదు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. భారత ఆటగాళ్లు చాహల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, హార్దిక్‌, కృనాల్ పాండ్య కూడా శ్రేయస్‌ డ్యాన్స్‌ను మెచ్చుకున్నారు. ధనశ్రీ.. ‘అదరగొట్టావ్‌.. కానీ ఎలా?’ అని కామెంట్ చేశారు. కాగా, డిసెంబర్‌లో చాహల్, ధనశ్రీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో ఒక్కటయ్యారు. ధనశ్రీ యూట్యూబర్‌గా నెట్టింట్లో ఎంతో ఫేమస్‌. అద్భుతమైన స్టెప్పులతో డ్యాన్స్‌ వేస్తూ సామాజిక మాధ్యమాల్లో తరచూ ఆమె వీడియోలు పోస్ట్‌ చేస్తుంటారు.

ఇవీ చదవండి

ఓటమిపై సాకులు వద్దు.. పునఃసమీక్షించండి

తప్పులు, వైఫల్యాల్ని కోహ్లీ అంగీకరిస్తాడు


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని