ఎనిమిదేళ్ల తర్వాత ‘రాధేశ్యామ్’తో ఎంట్రీ - simran kaur in prabhas radhe shyam
close
Published : 15/03/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎనిమిదేళ్ల తర్వాత ‘రాధేశ్యామ్’తో ఎంట్రీ

హైదరాబాద్‌: దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు ముద్దుగుమ్మ సిమ్రన్‌ కౌర్‌. మంచు మనోజ్‌ కథానాయకుడిగా నటించిన ‘పోటుగాడు’లో వైదేహిగా కనిపించి ప్రేక్షకుల్ని అలరించిన ఆమె అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్‌కు దూరమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా సిమ్రన్‌ తిరిగి తెలుగు సినీ పరిశ్రమవైపు తన దృష్టి మళ్లీంచారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’తో ఆమె రీఎంట్రీ ఇస్తున్నారు.

‘‘వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం వెండితెరకు దూరం కావాల్సి వచ్చింది. కొన్నినెలల క్రితం ‘రాధేశ్యామ్‌’ టీమ్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ఆ భారీ బడ్జెట్‌ సినిమాలో నాకో రోల్‌ ఆఫర్‌ చేశారు. పాత్ర కూడా తెలుసుకోకుండానే ఓకే చెప్పేశాను. ఆ తర్వాత రోజు హైదరాబాద్‌కు వచ్చి షూట్‌లో పాల్గొన్నాను. నా రోల్‌ ఇందులో ఎంతో కీలకమైనది. అలాంటి గొప్ప టీమ్‌తో కలిసి నటించినందుకు ఆనందంగా ఉంది’’ అని సిమ్రన్‌ తెలిపారు. ప్రభాస్‌ - పూజాహెగ్డే జంటగా నటిస్తున్న వింటేజ్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ కీలకపాత్రలో కనిపించనున్నారు. జులై 30న ఈ సినిమా ప్రేక్షుకుల ముందుకు రానుంది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని