సోనియా, రాహుల్‌తో స్టాలిన్‌ భేటీ! - tamil nadu cm mk stalin meets sonia gandhi son rahul in delhi
close
Published : 19/06/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోనియా, రాహుల్‌తో స్టాలిన్‌ భేటీ!

దిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి దిల్లీ పర్యటన చేపట్టారు. తమిళనాడులో నూతనంగా కొలువైన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలు, విధానాలపై ఇరు పార్టీల నాయకులు చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా తమిళనాడును అభివృద్ధి పథంలో నడిపించేందుకు డీఎంకేతో కలిసి పనిచేస్తూనే ఉంటామని రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ భేటీపై స్పందించిన స్టాలిన్‌, ఇరు పార్టీలది ఎంతోకాలం నుంచి కొనసాగుతోన్న అనుబంధమని అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో స్టాలిన్‌ ఇప్పటికే భేటీ అయ్యారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయనకు వివరించారు. ఈ సమయంలో రాష్ట్రానికి అదనంగా వ్యాక్సిన్‌ డోసులను కేటాయించాలని ప్రధానిని కోరారు. తమ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ మధ్యే తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి భారీ ఆధిక్యంతో అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని