Manchu Vishnu: ఆ నాలుగు సినిమాల ఎంపిక తప్పు! - telugu news alitho saradaga promo actor manchu vishnu
close
Updated : 17/08/2021 15:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Manchu Vishnu: ఆ నాలుగు సినిమాల ఎంపిక తప్పు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మంచి దర్శకులని ఎంపిక చేసుకోకపోవడమే నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు’ అని మంచు విష్ణు తెలిపారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ఈ మాట అన్నారు. ఆగస్టు 23న ప్రసారం కానున్న ఈ కార్యక్రమ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో తన వ్యక్తిగత, సినిమా విషయాలు పంచుకుంటూ సందడి చేశారు విష్ణు. ‘మంచు విష్ణు.. బాబు?’ అని ఆలీ అనగా ‘బాబోయ్‌.. మీరు కూడానా’ అంటూ ప్రారంభంలోనే నవ్వులు పూయించారు. భారతదేశంలోని లెజెండరీ నటుల్లో తన తండ్రి మోహన్‌ బాబు ఒకరని, ఆయన తనయుడిగా ఒకట్రెండు సినిమాలకు అవకాశాలు రావొచ్చని, దాని తర్వాత టాలెంట్‌ ఉంటేనే కెరియర్‌ ఉంటుందని తెలిపారు. టాలెంట్‌ ఉంది కాబట్టే ఈ షోలో ఉన్నానన్నారు.

అక్క లక్ష్మి అంటే నాన్నకు ఎందుకంత ప్రేమో.. తనకి అమ్మాయిలు పుట్టినప్పుడు అర్థమైందని చెప్పారు. ‘అందుకే పోటీపడి నలుగురిని కన్నావా’ అని ఆలీ కామెడీ పంచారు. తన ప్రేమ, భార్య గురించి కొన్ని సంగతులు పంచుకున్నారు. ఇంకా పిల్లల్ని కందామా? అని అడిగితే తన భార్య ‘ఇంకెవరినైనా చూస్కో’ అంది అని సమాధానమిచ్చారట. తర్వాత సినిమాల గురించి చెప్తూ.. మూర్ఖత్వం, సెంటిమెంట్‌..తదితర కారణాలతో మంచి దర్శకులను ఎంపిక చేసుకోలేకపోయానన్నారు.

మీ తమ్ముడు, నటుడు మనోజ్‌ మీద మీరు చాలా కోపంగా ఉంటున్నారని టాక్‌ వినిపిస్తోంది. దీనిపై మీరేమంటారు? అని ఆలీ అంటే ప్రశ్నించగా ‘ఎందుకు చెప్పాలి వాళ్లకి సమాధానం’ అంటూ విష్ణు సీరియస్‌గా లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. మోహన్‌బాబుని చూడగానే లేవడం, చేతులు కట్టుకోవడం మనసులోంచి వచ్చిందా, నటనా? అని మరో ప్రశ్నగా ఆలీ అడిగిన దానికి విష్ణు ఏం సమాధానం చెప్పారు? ‘మా’ ఎన్నికల  గురించి ఏం మాట్లాడారు? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసేయండి...



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని