Kishan reddy: బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాల అమలు: కిషన్‌రెడ్డి - telugu news bc commission conferencein hyderabad
close
Published : 26/09/2021 17:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kishan reddy: బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాల అమలు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలోని భాజపా సర్కార్‌ పథకాలు అమలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన జాతీయ బీసీ కమిషన్‌ సదస్సులో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. ఆయనతో పాటు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సదస్సుకు హాజరయ్యారు. బీసీ కమిషన్‌ ఆదేశాలు అమలు చేయకపోతే అండగా నిలవాల్సిన బాధ్యత బీసీ సంఘాలదేనని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీలు ఉన్నారని.. తిండిలేక ఇబ్బందులు పడుతున్న వారి కోసమే ఆహార భద్రత చట్టం తీసుకొచ్చినట్లు చెప్పారు. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. 27 శాతం రిజర్వేషన్లతో బీసీలు మరింత బలపడతారని వెల్లడించారు.

సమాజంలో విద్యతోనే బీసీలకు గౌరవం, సముచిన స్థానం లభిస్తుందని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా విద్యతోనే బీసీలు అభివృద్ధి చెందుతారని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని