Vaccination: భారత్ రికార్డు ఫీట్‌.. ప్రశంసిస్తున్న ప్రపంచం - telugu news india achieved a new feat in its covid vaccination drive
close
Published : 28/08/2021 12:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccination: భారత్ రికార్డు ఫీట్‌.. ప్రశంసిస్తున్న ప్రపంచం

దిల్లీ: కరోనా టీకా కార్యక్రమం కింద భారత్‌ శుక్రవారం రికార్డు స్థాయిలో టీకా డోసుల్ని పంపిణీ చేసింది. ఒక్కరోజే కోటిమందికి పైగా టీకా వేయించుకున్నారు. మనదేశం సాధించిన ఈ ఘనతపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. కరోనాపై జరుపుతున్న పోరాటంలో భారత్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మెప్పు పొందింది. 

భారత్ వయోజన జనాభాలో 50 శాతం టీకా కవరేజ్‌ (కనీసం ఒక్కడోసు) సాధించింది. 62 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే కోటిమంది పైగా టీకా వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతిఒక్కరికీ అభినందనలు. టీకా, ప్రజారోగ్యం, వ్యక్తిగత నివారణ చర్యలు మనల్ని కాపాడతాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్

టీకా కార్యక్రమంలో కీలక మైలురాయి దాటిన భారత్‌కు అభినందనలు. ప్రభుత్వం, టీకా అభివృద్ధి, తయారీ సంస్థలు, వైద్య సిబ్బంది సమష్టి కృషి వల్ల ఈ ఘనత సాధ్యమైంది.

-మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్

ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా దీనిపై ఇప్పటికే స్పందించారు. ఒక్కరోజే కోటిమందికి టీకాలు వేయడం గొప్ప విషయమని ప్రధాని మోదీ అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని