IND vs ENG: టీమ్‌ఇండియా నాలుగు కుందేళ్లను ఆడించకూడదు: వాన్ - telugu news india vs england team india cannot have four rabbits at tailenders
close
Published : 30/08/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IND vs ENG: టీమ్‌ఇండియా నాలుగు కుందేళ్లను ఆడించకూడదు: వాన్

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా లోయర్‌ ఆర్డర్‌లో ఏకంగా నాలుగు కుందేళ్లను (స్పెషలిస్టు బౌలర్లు షమి, బుమ్రా, ఇషాంత్‌, సిరాజ్‌) ఆడించకూడదని ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఏ జట్టూ అలా చేయదని గత రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీసేన ఇలా ఎందుకు ఆడిందో అర్థం కాలేదని అన్నాడు. ఇరు జట్ల మధ్య శనివారం ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్‌లో స్పందించిన వాన్‌.. తమ సారథి జోరూట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతూ కోహ్లీ నిర్ణయాలను తప్పుబట్టాడు.

తొలి టెస్టు తర్వాత శార్ధూల్‌ ఠాకూర్‌ గాయం కారణంగా తప్పుకోవడంతో భారత్‌ నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలోనే లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా, షమి చివర్లో 89 పరుగుల భాగస్వామ్యం జోడించి జట్టును విజయపథంలో నడిపించారు. అయితే, ఈ ప్రదర్శన టీమ్‌ఇండియా అంచనాల్ని తలకిందులు చేసిందని వాన్‌ అభిప్రాయపడ్డాడు. ‘8-11వ స్థానం వరకు వాళ్లను ఆడించకూడదు. లార్డ్స్‌లో బుమ్రా, షమి సాధించిన పరుగులు ఆ జట్టు టెయిలెండర్లపై తప్పుడు అంచనాలు నెలకొల్పాయి. వాస్తవికంగా ఎనిమిదో స్థానంలో షమిని వాళ్లు పంపకూడదు’ అని వాన్‌ పేర్కొన్నాడు.

అలాగే టీమ్‌ఇండియా ఈ టెస్టులో సరైనా ఆలోచనా విధానం లేకుండా, అంకితభావం లేకుండా ఆడిందని ఇంగ్లాండ్ మాజీ సారథి అన్నాడు. తొలిరోజు బ్యాటింగ్‌లో తక్కువ స్కోరుకే ఔటయ్యాక ఆటగాళ్ల ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని చెప్పాడు. ఈ మ్యాచ్‌ పోతే పోయింది. తర్వాతి మ్యాచ్‌ నుంచి చూసుకుందాం అనే భావనలో ఉన్నారన్నాడు. అయితే, ఓవల్‌లో జరిగే నాలుగో టెస్టుకల్లా భారత్‌ తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కితే బాగా ఆడుతుందని వాన్‌ వివరించాడు. మరోవైపు కెప్టెన్‌ కోహ్లీ సైతం తర్వాతి మ్యాచ్‌లో రాణిస్తాడన్నాడు. అంతకుముందు ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌పై స్పందిస్తూ ఆ జట్టుకు అత్యధిక టెస్టు విజయాలు అందించిన నాయకుడిగా నిలిచినందుకు ప్రత్యేకంగా ప్రశంసించాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని