Governer Tamilisai: ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి నియామకంపై నిర్ణయం తీసుకోలేదు: తమిళిసై - telugu news kaushik reddy appointment as mlc is yet to be decided says governer
close
Updated : 08/09/2021 15:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Governer Tamilisai: ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి నియామకంపై నిర్ణయం తీసుకోలేదు: తమిళిసై

హైదరాబాద్: తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గవర్నర్‌ తమిళిసై అన్నారు. కౌశిక్‌రెడ్డి నియామకానికి సంబంధించి మంత్రివర్గం సిఫార్సు చేసిందని ఆమె చెప్పారు. ఆ సిఫార్సును మరింత అధ్యయనం చేయాల్సి ఉందని గవర్నర్‌ తెలిపారు. సామాజిక సేవా విభాగంలో పంపినందున పరిశీలిస్తున్నానని వివరించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్‌ను వీడి ఇటీవల తెరాసలో చేరిన కౌశిక్‌రెడ్డిని నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా మంత్రివర్గం ఖరారు చేసిన విషయం తెలిసిందే.  




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని