Rajinikanth - Peddanna: నలుగురు నాయికలతో రజనీకాంత్‌ హంగామా.. ‘పెద్దన్న’ ట్రైలర్‌ అదిరింది! - telugu news peddanna trailer rajinikanth
close
Updated : 27/10/2021 19:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rajinikanth - Peddanna: నలుగురు నాయికలతో రజనీకాంత్‌ హంగామా.. ‘పెద్దన్న’ ట్రైలర్‌ అదిరింది!

ఇంటర్నెట్‌ డెస్క్: రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘అన్నాత్తే’ (Annathe). తెలుగులో ‘పెద్దన్న’ (Peddanna) పేరుతో విడుదల కానుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ  సినిమా దీపావళి కానుకగా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ (Peddanna Trailer)ని విడుదలచేసింది. రజనీకాంత్‌ అభిమానులు కోరుకునే యాక్షన్‌, కామెడీ.. ఇలా అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. రజనీకాంత్‌ స్టైల్, సంభాషణలు మెప్పిస్తున్నాయి. రజనీకాంత్‌ సోదరిగా కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రజనీకి జోడీగా నయనతార (Nayanatara) మెరిసింది. మీనా, ఖుష్బూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం: డి. ఇమ్మాన్‌, ఛాయాగ్రహణం: వెట్రి.



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని