Sonakshi Sinha: నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగిన అభిమాని.. సోనాక్షి స్పందన ఇదే! - telugu news sonakshi sinha reply to netizen about marriage
close
Published : 25/08/2021 16:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sonakshi Sinha: నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగిన అభిమాని.. సోనాక్షి స్పందన ఇదే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నన్ను పెళ్లి చేసుకుంటారా?’అని అడిగిన ఓ నెటిజన్‌కి బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా తనదైన శైలిలో సమాధానం ఇచ్చి, నెట్టింట ఆకట్టుకుంటోంది. సోనాక్షి.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో అప్పుడప్పుడూ ముచ్చటిస్తూనే ఉంటుంది. ఎప్పటిలానే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ పేరిట ఓ సెషన్‌ నిర్వహించింది. ప్రశ్నలు అడిగిన వారందరికీ సరదాగా రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్‌/ అభిమాని ‘మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని అడగ్గా  ‘ప్రస్తుతానికి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఇలాంటి ప్రపోజల్స్‌ని అంగీకరించట్లేదు’ అని సోనాక్షి సమాధానం ఇచ్చింది. మరికొందరు నెటిజన్లు తన ఫోన్‌ వాల్‌పేపర్‌ని, యూట్యూబ్‌ హిస్టరీని చూపించమని కోరగా సంబంధిత వివరాల్ని స్క్రీన్‌షాట్‌ తీసి వారితో పంచుకుంది. మరి సోనాక్షి ఏ వాల్‌పేపర్‌ సెట్‌ చేసుకుందో, యూట్యూబ్‌లో ఏం చూసిందో మీరూ చూసేయండి...



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని