Sundeep Kishan: కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించిన సందీప్‌ - telugu news sundeep kishan new movie pooja ceremony held at hyderabad
close
Published : 19/09/2021 12:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sundeep Kishan: కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించిన సందీప్‌

హైదరాబాద్‌: ‘గల్లీరౌడీ’తో మంచి టాక్‌ సొంతం చేసుకుని ఇప్పుడు అదే జోష్‌లో కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించారు నటుడు సందీప్‌ కిషన్‌. ఆయన హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఆదివారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. హీరోలు నాగశౌర్య, అల్లరి నరేశ్‌ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ముహూర్తపు షాట్‌ చిత్రీకరణలో హీరో హీరోయిన్లపై నరేశ్‌ క్లాప్‌ కొట్టగా.. నాగశౌర్య కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో సందీప్‌కు జోడీగా నటి కావ్య థాపర్‌ సందడి చేయనున్నారు. హాస్య మూవీస్‌ పతాకంపై రాజేశ్‌ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో రెగ్యూలర్‌ షూట్‌ ప్రారంభం కానుంది. ‘టైగర్‌’ తర్వాత ఆనంద్‌-సందీప్‌ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని