Chandrababu: ప్రభుత్వంపై తిరుగుబాటుకు ప్రజలు సిద్ధమయ్యారు: చంద్రబాబు - telugu news tdp cheif chandrababu comments on ap govt
close
Updated : 02/09/2021 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chandrababu: ప్రభుత్వంపై తిరుగుబాటుకు ప్రజలు సిద్ధమయ్యారు: చంద్రబాబు

అమరావతి: ఏపీలో వైకాపా ప్రభుత్వం రెండేళ్లుగా తెదేపా నేతల్ని వేధిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఆయన నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెట్రో ధరలపై ఆందోళన చేస్తే చింతమనేనిని అరెస్టు చేశారన్నారు. ఉపాధి బిల్లలు చెల్లించకుండా వేధిస్తు్న్నారని విమర్శించారు. తిరగబడితే ప్రభుత్వం తోకముడుస్తుందని.. ప్రజలు కూడా తిరుగుబాటుకు సిద్ధమయ్యారన్నారు. తెదేపా నేతల ఫోన్లు లాక్కుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని