KGF Teaser: ‘కేజీఎఫ్ 2’ టీజర్‌ @ 200 M+ - telugu news yash - prasanth neel kgf teaser views crossed 200 million views
close
Published : 16/07/2021 16:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

KGF Teaser: ‘కేజీఎఫ్ 2’ టీజర్‌ @ 200 M+

ఇంటర్నెట్‌  డెస్క్: సాధారణంగా వచ్చి అద్భుతంగా మారిన సినిమాల్లో ‘కేజీఎఫ్‌’ ఒకటి. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా వచ్చిన ‘కేజీఎఫ్‌’తో యశ్‌ సూపర్‌ స్టార్‌ అయిపోయాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అయిపోయారు. ఆ జోరులో ‘కేజీఎఫ్‌ 2’ను మొదలెట్టారు. చిత్రీకరణ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. తొలి సినిమా విజయం ఇచ్చిన  ఊపును చిత్రబృందం ఇంకా కొనసాగిస్తోంది. అందులో భాగంగా సినిమా టీజర్‌ రికార్డులతో దూసుకుపోతోంది. 

ఈ ఏడాది సంక్రాంతికి ముందు... హీరో యశ్‌ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.  సినిమా కథను గుర్తు చేస్తూ... జరగబోయే కథను వివరిస్తూ ఈ టీజర్‌ను రూపొందించారు. గూస్‌బంప్స్‌ తెచ్చే బీజీఎం, విజువల్స్‌తో ఆకట్టుకుంది. అందుకే ఇప్పటివరకు ఆ వీడియో 20 కోట్లకుపైగా (200 మిలియన్లకుపైగా) వ్యూస్‌ సాధించింది. దీంతోపాటు తమ వీడియో 8.4 మిలియన్లకుపైగా లైక్స్‌, 11 మిలియన్లకుపైగా కామెంట్స్‌, వంద కోట్లకుపైగా ఇంప్రెషన్స్‌ సంపాదించిందని చిత్రబృందం ప్రకటించింది.

ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ‘గ్యాంగ్‌స్టర్స్‌ ఎప్పుడూ క్రేజీగానే ఉంటారు’ అంటూ 200 మిలియన్ల స్పెషల్‌ పోస్టర్‌ను షేర్‌ చేశారు. మరోవైపు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ అయితే... ‘గ్యాంగ్‌స్టర్స్‌ అందరూ కలసి... మా ‘మాన్‌స్టర్‌’ను ఎదురులేనివాడిగా మార్చారు’ అంటూ ట్వీట్‌ చేసింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని