Tokyo Olympics: ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్‌  - telugu news zverev smashed djokovic in tokyo olympics semi finals
close
Updated : 30/07/2021 16:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్‌ 

జకోవిచ్‌పై జ్వెరెవ్‌ అద్భుత విజయం..

టోక్యో: ఈ ఏడాది టెన్నిస్‌లో గోల్డెన్‌ స్లామ్‌ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలని ఆశించిన దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌కు నిరాశే ఎదురైంది. టోక్యో ఒలింపిక్స్‌లో శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఈ సెర్బియన్‌ ఆటగాడు జెర్మనీకి చెందిన అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ చేతిలో 1-6, 3-6, 6-1 తేడాతో ఓటమిపాలయ్యాడు. దాంతో ఈ ఏడాది గోల్డెన్‌స్లామ్‌ సాధించాలనే అతడి కల.. కలగానే మిగిలిపోయింది.

కాగా, జకోవిచ్‌ ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌తో పాటు వింబుల్డన్‌లోనూ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టోక్యో ఒలింపిక్స్‌తో పాటు త్వరలో జరిగే యూఎస్‌ ఓపెన్‌లోనూ సత్తా చాటాలని చూశాడు. కానీ, జ్వెరెవ్‌ ఒలింపిక్స్‌ సెమీస్‌లో అతడిని ఓడించి అందరికీ షాకిచ్చాడు. మరోవైపు టెన్నిస్‌లో ఇదివరకు గోల్డెన్‌ స్లామ్‌ సాధించింది స్టెఫిగ్రాఫ్‌ అనే జెర్మనీ క్రీడాకారిణి ఒక్కరే. ఆమె 1988లో ఆ రికార్డు నెలకొల్పడం విశేషం.

మరోవైపు జ్వెరెవ్‌ ఫైనల్లో రష్యా ఆటగాడు కరెన్‌ ఖచనోవ్‌తో పోటీపడనున్నాడు. అతడు సెమీస్‌లో స్పెయిన్‌ ఆటగాడు పబ్లో కర్రెనో బుస్టాపై 6-3, 6-3తో గెలుపొందాడు. ఇక సెమీస్‌లో ఓటమిపాలైన జకోవిచ్‌.. బుస్టాతో కాంస్యం కోసం పోటీపడతాడు. జకోవిచ్‌ రెండు నెలల క్రితం జరిగిన ఇటలీ ఓపెన్‌ ఫైనల్లో రఫెల్‌ నాదల్‌ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతడికి ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని