Top Ten News @ 9 AM - top ten news at nine am
close
Updated : 16/06/2021 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM

1. కొవిడ్‌ బాధితుల్లో రక్తం గడ్డకట్టడానికి కారణమిదే.. !

 కొవిడ్‌-19 సోకినవారి రక్తంలో ప్రాణాంతక గడ్డలు ఏర్పడటానికి కారణాలను ఐర్లాండ్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేలా కొత్త చికిత్స విధానాలను అభివృద్ధి చేయడానికి ఈ పరిశోధన వీలుకల్పిస్తుంది. రక్తం గడ్డకట్టడం వల్ల కరోనా బాధితుల్లో అనేక మంది చనిపోతున్నట్లు ఇప్పటికే జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో దీనికి కారణాలు, అవే ఏర్పడే తీరుపై రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఇన్‌ ఐర్లాండ్‌ (ఆర్‌సీఎస్‌ఐ) విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

CoronaVaccine: డోసుల వ్యవధి పెంపుతో నష్టం లేదు

2. IIT: స్వయంప్రభతో ఐఐటీల్లోకి!

పేద విద్యార్థి కూడా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేలా చేస్తామని ఐఐటీలు చెబుతున్నాయి. జేఈఈకి ప్రైవేటు సంస్థల్లో ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా ‘స్వయంప్రభ’ పోర్టల్‌ ద్వారా ప్రసారమయ్యే వీడియోలు చూస్తే సరిపోయేలా పాఠాలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపాయి. ‘సరైన కోచింగ్‌ లేకనే మేము ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు పొందలేకపోయాం’ అని ఏ విద్యార్థి భావించరాదనేదే లక్ష్యమని పేర్కొంటున్నాయి.వచ్చే అయిదేళ్లలో విద్యార్థులు ప్రైవేట్‌ కోచింగ్‌ సంస్థలపై ఆధారపడకుండా ఉండేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మెదడులో కల్పిత జ్ఞాపకాలు!

3. LJP: నాడు నగుబాటు.. నేడు తిరుగుబాటు

నాన్న రామ్‌విలాస్‌ పాసవాన్‌ను, తనను, తన కుటుంబాన్ని ఎంతో ఆప్యాయంగా చూసుకునే చిన్నాన్నే ఎందుకని తిరుగుబాటు జెండా ఎగరేశాడు? లోక్‌జన శక్తి పార్టీ (ఎల్జేపీ)లో ఎందుకని ముసలం ఆరంభమైంది? అబ్బాయి చిరాగ్‌ పాసవాన్‌పై ఎందుకని బాబాయ్‌ పశుపతి కుమార్‌ పరస్‌కు చిరాకు కలిగింది?... ఇదేమీ ఉన్నట్టుండో... పదవీ రాజకీయంలో భాగంగానో జరిగిందేమీ కాదు. దీని వెనకాలో కథ ఉందంటున్నారు పశుపతి కుమార్‌, ఆయన అనుచరులు! బిహార్‌ ఎన్నికలకు ముందు... ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్‌ పాసవాన్‌ చనిపోగానే... ఆయన కుమారుడు చిరాగ్‌ పాసవాన్‌ పార్టీ పగ్గాలు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కొరుక్కు తినేలా కొత్త యాపిల్‌!

ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు. నోట్‌బుక్స్‌ వంటి బరువులేవీ లేకుండా వెంట ఏదో ఒకటే తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఏం పట్టుకెళ్తారు? ఐఫోన్‌ ఒక్కటి చాలు! ఎప్పటికప్పుడు వినూత్న ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న యాపిల్‌ సంస్థ సరిగ్గా ఇలాంటి పరిస్థితినే సృష్టించే దిశగా అడుగులేస్తోంది. తాజా వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో (డబ్ల్యూడబ్ల్యూడీసీ 21) యాపిల్‌ ప్రకటించిన అప్‌డేట్స్‌ను చూస్తే ఇదింకెంతో దూరంలో లేదనే తోస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

JIO: వాట్సప్‌తోనూ జియో రీఛార్జ్‌!

5. China: డ్రాగన్‌కు సవాలుగా ‘ఏక సంతానం’

రాజరికాలకు స్థానం లేని సమ సమాజాన్ని స్వప్నించిన చైనాలో ‘ఒక్క సంతానమే ముద్దు’ అనే విధానంతో బుల్లి చక్రవర్తులు పుట్టుకురావడమే విధి విలాసం! కమ్యూనిస్టు ప్రభుత్వం నిర్బంధంగా అమలుచేసిన ఈ కుటుంబ నియంత్రణ విధానం మగ సంతాన వృద్ధికి దారితీసింది. ఆడ శిశువులు వద్దనుకునే చైనా సమాజంలో ఒకే ఒక్క మగ బిడ్డను కనడం సర్వసాధారణమైపోయింది. ఆ పుత్రరత్నాన్ని చంక దిగనివ్వకుండా అతి గారాబం చేయడానికి అమ్మానాన్నలు, వారిద్దరి అమ్మానాన్నలు పోటీపడటం సహజమైపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Biotechnology: బయో బియ్యం వస్తున్నాయ్‌

బయోటెక్నాలజీ విధానంలో అభివృద్ధి చేసిన ఓ రకం బియ్యంలో ఐరన్‌ శాతం అధికంగా ఉన్నట్టు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్సిటీ పరిధిలోని అనేక కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు ఎన్నో వరి వంగడాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘డబ్ల్యూజిఎల్‌1119’గా పిలిచే ఈ  వంగడాన్ని ఈ విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* AP News: పనస పొడితో మధుమేహానికి చెక్‌

7. ఆ అడుగులు చరిత్రాత్మకం!

కొన్ని దశాబ్దాల ముందు టెస్టు క్రికెట్‌ అనగానే అందరికీ ఒకప్పుడు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ లాంటి జట్లే గుర్తొచ్చేవి. వేర్వేరు కాలాల్లో సుదీర్ఘ ఫార్మాట్లో అవి సాగించిన ఆధిపత్యం అలాంటిది.అలాంటి జట్లను దాటి భారత్‌ మేటి టెస్టు జట్టుగా ఎదుగుతుందని.. ఈ ఫార్మాట్లో నంబర్‌వన్‌ ర్యాంకు సాధిస్తుందని.. తొలిసారి నిర్వహించే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంతో ఫైనల్‌ చేరుతుందని ఎవరూ ఊహించి ఉండరేమో! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కొవిడ్‌ నుంచి కోలుకున్నాకా సమస్యలు

కొవిడ్‌ నెగెటివ్‌ ఫలితం వచ్చిన తర్వాత కూడా కొందరిలో 3 నుంచి 6 నెలలపాటు లక్షణాలు ఉంటాయని, భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ప్రముఖ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ నిఖిల్‌ నారాయణ్‌ బాంతే, క్లినికల్‌ న్యూట్రీషనిస్ట్‌ ఇషీ కోస్లాలు పేర్కొన్నారు. కొవిడ్‌ అనంతర సమస్యలపై ‘ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో’ మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో వారు మాట్లాడారు. ‘‘కరోనా రెండో ఉద్ధృతిలో చాలామంది బాధితులు పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌ను ఎదుర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వ్యాక్సిన్లన్నీ సురక్షితమే..

9. అమ్మో.. ఆస్తిపన్ను!

గరాలు, పట్టణాల్లో దశాబ్దాలుగా అనుసరిస్తున్న అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానానికి స్వస్తి చెప్పి, నిర్మాణం, స్థలం రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారిత పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలపై రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగుతోంది. దీనిపై పన్ను చెల్లింపుదారులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. కొత్త పన్ను విధానానికి వ్యతిరేకంగా పలు నగరాలు, పట్టణాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. కొత్త విధానంలో పన్ను... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పెళ్లామే కావాలన్న పదహారేళ్ల బాలుడు

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని అలహాబాద్‌ హైకోర్టు ముందుకు ఓ వింతకేసు వచ్చింది. పదహారేళ్ల బాలుడిని తమ సంరక్షణలో ఉండేలా అనుమతించాలంటూ ఇటు తల్లి, అటు ‘భార్య’ కోర్టు ముంగిటకు వచ్చారు. మైనర్‌ వివాహం చెల్లుబాటు కాదు కాబట్టి, తల్లి వెంట వెళ్లమంటే బాలుడు ససేమిరా అంటూ పెళ్లామే కావాలంటాడు. ఈ కోరిక మన్నిద్దామంటే.. ఓ మైనర్‌ బాలుడు మేజర్‌ యువతితో సహజీవనం చేస్తే పోక్సో చట్టం ప్రకారం నేరం అవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

CJI: హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రంమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని